For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ ఎలక్షన్లో పోటీ చేయడంపై మంచు విష్ణు వివరణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు ఫ్యామిలీ హీరో విష్ణు త్వరలో జరుగబోయే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎలక్షన్'లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని విష్ణు వివరణ ఇచ్చారు. తాను పోటీ చేయడం లేదని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి చేపట్టేంత స్థాయి ఇంకా తనకు రాలేదని ట్వీట్ చేసారు. రాజేంద్రప్రసాద్ అంకుల్ పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు నా మద్దతు ఉంటుంది అన్నారు.

    రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నట్లు గత కొన్ని రోజుల క్రిత్రమే ప్రకటించారు. ఈ నెల 29న మా కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ కొనసాగుతున్నారు.

    Vishnu denies rumors on contesting for MAA

    ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పిన రాజేంద్రప్రసాద్.... ఒకవేళ మా అధ్యక్ష పదవికి పోటీ ఉన్నా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న మురళీ మోహన్ స్థానం ఖాళీ అయితే కొత్త వ్యక్తి రావాలని పలువురు ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడుతున్నారు.

    English summary
    Actor Vishnu Manchu has denied the ongoing rumors of him contesting for the post of Movie Artistes’ Association (MAA) President. Denying the news via Twitter, Vishnu said, “Been reading on news about me being considered as the President of MAA. Its an honor to be even considered by many for this post. But with HeroManoj1 wedding, #DynamiteTheMovie #singam123 & other commitments I will not be able to execute this role 100%. Also as Rajendra Prasad uncle expressed to be the president, given his seniority, we all should stand by him. Hope to put rest to the rumors.” (sic)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X