విష్ణు ‘దూసుకెళ్తా’: ముద్దొస్తున్న లావణ్య
హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'దూసుకెళ్తా' చిత్రంలో అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లావణ్య అందాలు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. తాజాగా విడుదలైన ఈచిత్రం ఫోటోల్లో లావణ్య ఎంతో ముద్దొస్తోందని అంటున్నా ఆమె అభిమానులు.
దూసుకెళ్తా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ కి తగినట్లే విజయం వైపు దూసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.
త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం : మణిశర్మ, కెమెరా: సర్వేష్ మురారి, కళ: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్, సమర్పణ: అరియానా, వివియానా.


Click it and Unblock the Notifications












