twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సలీం..దుమ్ము రేపేది అప్పుడే

    By Srikanya
    |

    విష్ణు, ఇలియానా కాంబినేషన్లో వైవియస్ చౌదరి సలీం..దుమ్మురేపుతాడు అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని 2010 సంక్రాంతికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు సంవత్సరం క్రిందట ప్రారంభమైన ఈ చి్త్రం రకరకాల కారణాలతో షూటింగ్ వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. అయితే ఇప్పటివరకూ వచ్చిన రషెష్ చూసిన వారు మాత్రం విష్ణుకు మంచి హిట్ సినిమా వచ్చినట్లే అంటున్నారు. ఈ చిత్రం కోసం విష్ణు సన్నగా మారి,హెయిల్ స్టైయిల్ మార్చారు. ఇక ఇలియానా..వైవియస్ చౌదరి పరిచయం చేసిన హీరోయిన్ కావటంతో మరింత ఉత్సాహంగా అందాల ఆరబోత కార్యక్రమం చేసిందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని మోహన్ బాబు, బిగ్ పిక్చర్స్ వారితో కలిసి తమ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే ఆయన ఈ చిత్రంలో లోకల్ డాన్ గా మరో ముఖ్యమైన పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు సలీం అనే పాత్రను చేస్తుంటే, ఇలియానా సత్య అనే అల్లరి అమ్మాయిగా, కావేరి ఝా చిట్టి అనే మరో ముఖ్యమైన పాత్రను చేస్తోంది. సందీప్ చౌతా అందించిన సంగీతం డిసెంబర్ లో విడుదల కానుంది. ఇక వైవియస్ చౌదరి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఒక్క మగాడు చిత్రం కూడా సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X