ఆ సినిమా విష్ణు తోనా!!

By Staff

Vishnu Vardhan
ప్రియమణికి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టిన 'పరుత్తివీరన్' సినిమా తెలుగులో రీమేక్ కాబోతోందనే వార్త అంతటా వినపడుతోంది.అలాగే ఈ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీక్ చేసిన హీరో పాత్రను విష్ణు వర్దన్ చేయనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. పక్కా గ్రామీణ వాతావరణంలో చదువు సంధ్య లేకుండా తినటం,త్రాగంటం,వేశ్యలతో తిరగటం..ఎవరైనా అడ్డొస్తే తన్నటం..చేస్తూ మొండిగా పోరంబోకు లా తిరిగే పాత్ర ఇది.

అక్కడ కార్తీక్ ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రాణ ప్రతిష్ట చేసి హిట్టు కొట్టాడు. మరి విష్ణు వర్ధన్ ఆ రేంజ్ నటన కనపర్చగలడా అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ఇక ఈ చిత్రం రైట్స్ ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వారి వద్ద ఉన్నాయి. వారు..ఈ సినిమాని ఆ చిత్ర దర్శకుడు అమీర్ తోనే తియ్యాలని భావిస్తున్నారుట.చర్చలు జరుగుతున్నాయట. అయితే ప్రియమణే హీరోయిన్ పాత్రను చేసే అవకాశం ఉందిట. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X