రకరకాల రంగాలలో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే మోహన్ బాబు తనయుడు విష్ణు వర్ధన్ ాబు ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే రైటర్స్ అసోసియేషన్‌లో మెంబరైన విష్ణు తాజాగా ఫైటర్స్ అసోసియేషన్‌లోనూ సభ్యత్వం తీసుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత, కార్మిక నాయకులు తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఇటీవల విష్ణు ఈ సభ్యత్వం అందుకున్నారు. ఓ ప్రముఖ యువ కథానాయకుడు తమ సంఘంలో చేరడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సంఘ నాయకులు తెలిపారు.అంటే త్వరలోనే విష్ణు తన సొంత ఫైట్స్ తానే కంపోజ్ చేసుకోబోతున్నాడన్నమాట...గుడ్