twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఫ్యామిలీపై ట్రోల్స్ వెనుక.. ప్రముఖ నటుడి హస్తం.. ఎంతవరకైనా రెడీ.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

    |

    డైలాగ్ కింగ్ మోహన్ బాబు మంచు నట వారసుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్న హీరో విష్ణు మంచు. గత కొద్దికాలంగా ప్రేక్షకులను మెప్పించేందుకు విభిన్నమైన పాత్రలతో ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రేక్షకులను కొత్తగా అనుభూతిని పంచేందుకు జిన్నా సినిమాతో సిద్దమయ్యారు. సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్ నటించిన జిన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఇన్‌ఫ్ల్యూయర్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

    సినీ తారలను టార్గెట్

    సినీ తారలను టార్గెట్


    కాలానికి తగినట్టుగా మారిన పరిస్థితుల్లో మీడియా కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రస్తుతం యూట్యూబ్‌ కూడా ప్రధాన మీడియాగా మారింది. అయితే ప్రభావవంతంగా మారిన యూట్యూబ్ మీడియా నా ఫ్యామిలీని, సినీ తారల కుటుంబాలను టార్గెట్ చేస్తున్నది. అవాస్తవాలను, నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. దాని వల్ల ఫ్యామిలీలు ఎంత బాధపడుతాయో అర్ధం చేసుకోవాలి అని మంచు విష్ణు అన్నారు.

    18 యూట్యూబ్ ఛానెల్స్‌పై కేసులు

    18 యూట్యూబ్ ఛానెల్స్‌పై కేసులు


    సినీ కుటుంబాలను టార్గెట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. దాదాపు 18 యూట్యూబ్ ఛానెల్స్‌పై కోర్టులు కేసులు నమోదు చేయబోతున్నాం. ఈ విషయంలో మేము ఎంతవరకైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నాం. ప్రతీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. మా సంస్థ యూట్యూబ్ నిర్వాహకులతో మాట్లాడుతున్నాం. కేంద్ర సమాచార, ప్రసారశాఖతో మాట్లాడుతున్నాం. వాస్తవాలను వక్రీకరించారనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 18 ఛానెల్స్‌ను తొలగించింది అని విష్ణు మంచు చెప్పారు.

    మాపై ఫన్ చేసినా

    మాపై ఫన్ చేసినా


    సినీ తారలందరూ అద్దాల మేడలో బతుకుతుంటారు. వారి జీవితం అందరి ముందు స్పష్టంగా ఉంటుంది. అలాంటి సినీ తారల జీవితాల గురించి ఊహించుకొని కథనాలు ప్రసారం చేయడం, వీడియోలు జనరేట్ చేయడం తప్పగా భావిస్తున్నాం. సినిమా పరంగా, వ్యక్తిగతంగా మమ్మల్ని కామెంట్ చేయండి. వాస్తవాలతో మమ్మల్ని ఏడిపించండి. మాపై ఫన్ చేసినా భరిస్తాం. కానీ మా ఫ్యామిలీలను మాత్రం టార్గెట్ చేయవద్దు అని విష్ణు మంచు అన్నారు.

    ట్రోలింగ్ వెనుక ఐటీ కంపెనీ

    ట్రోలింగ్ వెనుక ఐటీ కంపెనీ


    మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న యూట్యూబ్ కంపెనీని గుర్తించాం. జూబ్లీ హిల్స్‌లోని ఐటీ కంపెనీ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నది. 21 మంది ఉద్యోగులు కలిగి ఉన్న ఐటీ కంపెనీ మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నది. మమ్మల్ని, మా ఫ్యామిలీని వేధిసున్నది. మా ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు దర్యాప్తు చేశారు. మాకు వారి ఐపీ అడ్రస్‌లను అందజేసింది. ఓ ప్రముఖ నటుడు ఆఫీస్ ఐడీ నుంచి మాపై దుష్ప్రచారం చేస్తున్నట్టు గుర్తించాం అని విష్ణు మంచు తెలిపారు.

    ఆ ఛానెల్స్ మూయిస్తాం అంటూ

    ఆ ఛానెల్స్ మూయిస్తాం అంటూ


    యూట్యూబ్‌ సినీ తారలను, వారి కుటుంబాలను వేధిస్తున్న 18 యూట్యూబ్ ఛానెల్స్‌ను గుర్తించాం. గురువారం వారిపై కోర్టులోకేసు నమోదు చేస్తున్నాం. ఆ ఛానెల్స్‌ను మూయించేందుకు రెడీ అవుతున్నాం. త్వరలోనే అందరి బండారాలను బయటపెడుతాం అని విష్ణు మంచు అన్నారు.

    English summary
    Tollywood Actor Vishnu Manchu is coming with Ginna. In this occasion, He spoke to youtube media in his movie promotions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X