Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దారుణమైన గాయాలు: హీరో మంచు విష్ణు బైక్ యాక్సిడెంట్ వీడియో రిలీజ్
మంచు విష్ణు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం ఈ వారం విడుదలైంది. వాస్తవానికి ఈచిత్రం ఎప్పుడో రావాల్సి ఉన్నా... షూటింగ్ సమయంలో మంచు విష్ణుకు బైక్ యాక్సిడెంట్ అయి తీవ్రమైన గాయాలు కావడం వల్ల ఆలస్యం అయిన సంగతి తెలిసిందే.
మలేషియాలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ సమయంలో మంచు విష్ణు ప్రమాదానికి గురయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బైక్ స్కిడ్ అవ్వడంతో మంచు విష్ణు, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గాయాలపాయ్యారు. ప్రగ్యాకు చిన్న గాయాలే అయినప్పటికీ... మంచు విష్ణు చాలా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 40 రోజుల పాటు విష్ణు చికిత్స తీసుకున్నారు. ఆ యాక్సిడెంటుకు సంబంధించిన వీడియో తాజాగా విడుదల చేశారు.
ఈ యాక్సిడెంట్ వీడియో చూసిన మంచు ఫ్యామిలీ అభిమానులు చలించి పోతున్నారు. ఇంత తీవ్రమైన గాయాలను విష్ణు ఎలా భరించాడో...? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'ఆచారి అమెరికా యాత్ర' సినిమా విషయానికొస్తే బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, పృథ్వి, ప్రవీణ్, అనూప్ ఠాకూర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: సెల్వ, మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి.