విడాకుల తర్వాత మనోజ్‌ను చూసి భయపడ్డా: తమ్ముడి మానసికస్థితిపై విష్ణు కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సినీ కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచి వచ్చిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. హీరోగా, విలన్‌గా, నిర్మాతగా ఆయన ఎన్నో విజయాలను అందుకున్నారు. ఇక, ఆయన వారసులుగా మనోజ్, విష్ణు, లక్ష్మీ కూడా తెరంగేట్రం చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు కుటుంబంలో మనోజ్ విడాకుల వ్యవహారం హైలైట్ అయింది. ఈ నేపథ్యంతో తన తమ్ముడి విడాకుల తర్వాత జరిగిన పరిస్థితులపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే...

రెండింటిలోనూ సత్తా చాటిన మంచు మనోజ్
మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు మంచు మనోజ్. ‘దొంగ దొంగది' సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే, అతడికి సరైన హిట్ మాత్రం పడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం రాలేదు. హీరోగానే కాకుండా స్టంట్ మాస్టర్‌గానూ మనోజ్ చాలా సినిమాలకు పని చేశాడు.

ప్రేమించిన అమ్మాయితో మనోజ్ వివాహం
వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలోనే మంచు మనోజ్ తన స్నేహితురాలు ప్రణతి రెడ్డితో ప్రేమాయణం సాగించాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో పాటు అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటులు హాజరయ్యారు.

పెళ్లి తర్వాత స్పీడు తగ్గించిన మంచు హీరో
వివాహానికి ముందు వరకు స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన మంచు మనోజ్.. ఆ తర్వాత మాత్రం నెమ్మదించాడు. మరీ ముఖ్యంగా పెళ్లైన తర్వాత అతడు కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే నటించాడు. దీంతో మనోజ్ వైవాహిక జీవితం గురించి ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే అతడు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడని ప్రచారం కూడా జరిగింది.

భార్యకు విడాకులు ఇచ్చిన మంచు మనోజ్
ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణతితో అభిప్రాయ భేదాలు రావడంతో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. విడిపోయినప్పటికీ తాము స్నేహితులుగా ఉంటామని తెలిపాడు. వాస్తవానికి చాలా రోజుల నుంచి విడివిడిగా ఉంటున్నప్పటికీ.. తమ విడాకుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే అతడు లేఖ విడుదల చేశాడు.

విడాకుల తర్వాత మనోజ్‌ను చూసి భయపడ్డా
మంచు మనోజ్ విడాకులు తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఈ విషయంపై అతడి సోదరుడు మంచు విష్ణు స్పందించాడు. ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘మనోజ్ విడాకులు తీసుకోవడం అతడి వ్యక్తిగత నిర్ణయమే. అతడి నిర్ణయాన్ని అందరం గౌరవించాం. అయితే, ఆ సమయంలో మనోజ్‌ను చూసి చాలా భయపడ్డాను' అని చెప్పుకొచ్చాడు.

తమ్ముడి మానసికస్థితిపై విష్ణు కామెంట్స్
విడాకులు తీసుకున్న సమయంలో మంచు మనోజ్ డిప్రెషన్‌కు గురయ్యాడని జోరుగా వార్తలు వచ్చాయి. అందుకే అతడు చాలా కాలం పాటు బయటకు రాలేకపోయాడని అన్నారు. ఈ విషయంపైనా విష్ణు స్పందించాడు. ‘మనోజ్ డిప్రెషన్‌కు గురయ్యాడని నేననుకోను. ఆ సమయంలో ఎవరైనా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. మనోజ్ కూడా అలాగే కనిపించాడు' అని తెలిపాడు.
Recommended Video

ఆ విషయంలో తొందరపడొద్దని చెప్పాను
విడాకుల నిర్ణయం తీసుకున్న తర్వాత మంచు మనోజ్‌కు ఓ విషయం మాత్రమే చెప్పానని విష్ణు వెల్లడించాడు. ‘విడాకులు తీసుకున్న తర్వాత మనోజ్‌తో పెద్దగా మాట్లాడలేదు. కాకపోతే.. ఈ టైమ్‌లో ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పాను. కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టే అలా చెప్పాను' అని విష్ణు పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











