నారా వారికి మంచు వారబ్బాయి కౌంటర్.. చంద్రబాబు దిమ్మ తిరిగిందేమో!

Recommended Video

Hero Manchu Vishnu Satires On Chandrababu Naidu In Twitter || Filmibeat Telugu

భారీ ఉత్కంఠ నడుమ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఊహించని రీతిలో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ పార్టీ 151 స్థానాలు కైవసం చేసుకోగా.. తెలుగు దేశం పార్టీ మాత్రం 23 స్థానాల దగ్గరే చతికిల పడింది. కలలో కూడా అనుకోని ఈ పరిణామం టీడీపీ వర్గాలను షాక్‌కి గురిచేసింది. అయితే ఈ షాక్ నుంచి టీడీపీ సేన కోలుకోకముందే వారిపై పంచులేస్తూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్స్ పెడుతుండటం పసుపు పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. తాజాగా మంచు వారబ్బాయి మంచు విష్ణు నారా వారికి వేసిన కౌంటర్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ విశేషాలేంటో చూద్దామా..

వైసీపీలోకి మంచు వర్గం

వైసీపీలోకి మంచు వర్గం

మొదటి నుంచే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా నిలిచే మంచు ఫ్యామిలీ గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీని బాగా సపోర్ట్ చేసింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. జగన్ సమక్షంలో వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. ఇక మంచు విష్ణు సోషల్ మీడియాలో చేసిన హంగామా చూసి ఒక దశలో మంచు వారబ్బాయి ఎన్నికల బరిలో నిలువనున్నారా అనే సందేహాలు తలెత్తాయి.

చివరకు అతని సపోర్ట్‌గా

చివరకు అతని సపోర్ట్‌గా

మంచు వారబ్బాయి మంచు విష్ణు ఎన్నికల బరిలో నిలువనప్పటికీ తెర వెనుక చక్రం తిప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు మంచు విష్ణు. ఫలితాల తర్వాత చూస్తే చెవిరెడ్డి భారీ మెజార్టీతో విజయ కేతనం ఎగరేశారు. దీంతో మంచు విష్ణు ఫుల్ ఖుషీగా ఉన్నారని సమాచారం.

నారా ఫ్యామిలీ పై కౌంటర్..

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉండే మంచు విష్ణు.. తాజాగా నారా అంటే డెఫినేషన్ చెప్పి నారా ఫ్యామిలీ మొత్తానికి ఒకేసారి కౌంటర్ వేశారు. ''నారా (NARA)అంటే.. N అంటే (National) జాతీయ స్థాయిలో, A అంటే (Ambition) ఆశయం, R అంటే (Regional) ప్రాంతీయ స్థాయిలో, A అంటే (Aspirations) ఆకాంక్షలు. నేను బలంగా నమ్ముతున్నా.. మన ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీజీ ఎవర్ని ఇలా ట్రోల్ చేశారో మనకూ తెలుసు'' అని పేర్కొంటూ మంచు విష్ణు చేసిన ట్వీట్ సంచనలం సృష్టిస్తోంది.

ఓ వైపు ఆర్జీవీ రెచ్చిపోతుంటే మరోవైపు మంచు వారబ్బాయి

ఓ వైపు ఆర్జీవీ రెచ్చిపోతుంటే మరోవైపు మంచు వారబ్బాయి

ఇప్పటికే తెలుగు దేశం పార్టీ పరాజయంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల్లో సైకిల్ గాలి మాత్రమే పోతే.. ఆయన మాత్రం ఆ సైకిల్ అక్కరకు రాకుండా తుక్కు తుక్కు చేస్తున్నారు. దీంతో ఎటూతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ వర్గాలకు తాజాగా మంచు విష్ణు దిమ్మెతిరిగే కౌంటర్ వేయడం చావు దెబ్బ తీసినంత పని చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X