ఆమెతో నాకు లింకా? : మంచు విష్ణు
హీరో మంచు విష్ణు త్వరలో 'దొరకడు' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో మంచు విష్ణు-హన్సిక మధ్య చనువు పెరిగుతోందని, రోజు రోజుకు ఇద్దరి బంధం బలపడుతోందని, ఖాళీ సమయం దొరికొతే చాలు ఇద్దరూ కలుసి గడపడానికి ఇష్ట పడుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ పుకార్లపై మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. హన్సిక నాకు చిన్నప్పటి నుంచి తెలుసుకుని, నా వయసుతో పోల్చితో చాలా చిన్న పిల్ల, నేను ఇప్పటికీ ఆమెను చైల్డ్ గానే ట్రీట్ చేస్తూ ఉంటాను...ఆమెతో నాకు లింకు పెట్టి వార్తలు రాడం పనికిమాలిన పనిగా అభివర్ణించారు. నేను నా కెరీర్లో ఇప్పటి వరకు ఎవరితోనూ ఎఫైర్లు నడపలేదు, ఇలాంటి వార్తలు పుట్టించే వారికి బుద్ది, సిగ్గు లేదని మండి పడ్డారు.
ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు. గతంలో విష్ణు నటించిన పలు సినిమాలు వరుసగా ప్లాప్ కావడం, కవల పిల్లలకు జన్మనిచ్చిన నేపథ్యంలో భార్య పిల్లల బాగోగులు చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో....విష్ణు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











