మోహన్ బాబు-వర్మ ‘రౌడీ’ ఈరోజే..

By Srikanya

హైదరాబాద్: మోహన్ బాబు - మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రౌడీ'. ఈ సినిమా మొదటి ట్రైలర్ ని ఈ రోజు(7 మార్చి)న విడుదల చేస్తున్నారు. యు.ఎస్. లో న్యూజెర్శీ ప్రాంతంలో ఈ ట్రైలర్ విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తే మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో ఈ ట్రైలర్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి హీరోయిన్ గా కనిపించనుంది.

ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రం తుది దశకు చేరుకొంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

 Vishnu Manchu to launch 'Rowdy' trailer in New Jersey

సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

మోహన్ బాబు మాట్లాడుతూ... రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాం. నా పోర్షన్ షూటింగ్ అయిపోయింది. విష్ణు పోర్షన్ నడుస్తోంది. అలాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. ఈ చిత్రంలో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

మరో ప్రక్క మంచు కుటుంబంతో వరుసగా రెండో చిత్రం చేయడానికి రామ్‌గోపాల్‌ వర్మ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు విష్ణు కోసం మరో కథ సిద్ధం చేసుకొంటున్నారు. ఇదో థ్రిల్లర్‌ తరహా చిత్రమట. ఇందులో విష్ణు ఓ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారని సమాచారం. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. 'రౌడీ' విడుదలైన తరవాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి 'టెన్షన్‌ టెన్షన్‌' అనే పేరు పరిశీలిస్తున్నారు. సాంకేతిక వర్గం, ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X