»   » గుమ్మ‌డికొట్టేసిన విష్ణు మంచు ల‌క్కున్నోడు...ఫిభ్ర‌వ‌రి 3న గ్రాండ్ రిలీజ్‌

గుమ్మ‌డికొట్టేసిన విష్ణు మంచు ల‌క్కున్నోడు...ఫిభ్ర‌వ‌రి 3న గ్రాండ్ రిలీజ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈడోరకం-ఆడోరకం వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ల‌క్కున్నోడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని గుమ్మ‌డికాయ కొట్టేసింది. సినిమాను ఫిభ్ర‌వ‌రి 3న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

Luckunnodu

ఈ సంద‌ర్భంగా...చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా లక్కున్నోడు చిత్రం షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఇందులో విష్ణు త‌న‌దైన ల‌వ్‌, కామెడితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. విష్ణు మంచు, హ‌న్సిక స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్టుతో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జ‌న‌వ‌రిలో ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. ఫిభ్ర‌వ‌రి 3న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. డైమంగ్ ర‌త్న‌బాబు, పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, అచ్చు సంగీతం సినిమా పెద్ద ప్ల‌స్ అవుతాయి.పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల‌కిషోర్‌, ప్ర‌భాస్ శ్రీను కామెడితో ప్రేక్ష‌కులు ప్ర‌తి సీన్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది అన్నారు.

తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాణంః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్,

English summary
Versatile and talented hero Vishnu Manchu is on a roll with super hit Eedo Rakam Ado Rakam. Now, his new movie Luckunnodu with bubbly heroine Hansika Motwani has completed the entire shooting part. Director Raj Kiran of horror comedy hits Geethanjali and Tripura fame broke the pumpkin putting a full stop for production. The film is bankrolled by MVV Satyanarayana on MVV Cinema banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu