»   » బావిలో కప్పల్లా...అంటూ ఇతర స్టార్లపై మంచు విష్ణు సెటైర్లు!

బావిలో కప్పల్లా...అంటూ ఇతర స్టార్లపై మంచు విష్ణు సెటైర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు - రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఈడోర‌కం - ఆడోర‌కం. సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా మీడియా ఇంటరాక్షన్ లో విష్ణు సంచలన కామెంట్స్ చేసారు. హిందీలో హీరోలు క‌ల‌సి మెలిసి న‌టించి ఆర్ధికంగా సినిమా స్ధాయిని పెంచుతున్నారు. కానీ మ‌నం మాత్రం బావిలో క‌ప్ప‌ల్లా త‌యార‌య్యాం అంటూ మంచు విష్ణు అనడం చర్చనీయాంశం అయింది.

మల్టీ స్టారర్ సినిమాలో ఎవరితో చేయడానికైనా నేను రెడీ, పాత్ర నిడివి ఎంత తక్కువ అయినా, పాత్ర చిన్నదైనా నేను చేయడానికి సిద్దమే...ఎలాంటి పాత్ర అయినా మెప్పించగలననే నమ్మకం నాకుంది. ఇతర హీరోల్లో ఆ నమ్మకం లేదేమో? అంటూ కామెంట్ చేసారు. మంచు విష్ణు అన్నదాంట్లో తప్పేం లేదు కానీ విష్ణు ఇలా వారిని ఓపెన్ గా విమర్శించడం గమనార్హం.

Vishnu Manchu Makes Sensational Remarks About Heroes, Throws A Challenge At Them

రాజ్ తరుణ్ ను ఈ సినిమాలో తీసుకోవడంపై స్పందిసస్తూ....ఆ క్యారెక్ట‌ర్ కోసం చాలా మందిని సంప్రదించాం. కానీ..ఎవ‌రు ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు. ఆ స‌మ‌యంలో సినిమా చూపిస్త మావ చూసాను. ఆ సినిమాలో రాజ్ త‌రుణ్ న‌ట‌న నాకు బాగా న‌చ్చింది. మేం అనుకున్న పాత్రకు సెట్టవుతాడని అనిపించింది. రాజ్ త‌రుణ్ సంప్ర‌దిస్తే కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు అన్నారు.

రాజేంద్రప్రసాద్‌, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, సుప్రీత్‌, శత్రు, ధనరాజ్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యకృష్ణ, హేమ, గీతాసింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: నరేష్‌ కథూరియా, స్మీప్‌ కాంగ్‌, మాటలు: డైమంట్‌ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌ వర్మ, ఆర్ట్‌: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గరికపాటి కిషోర్‌, మేకప్‌: రంగా, కాస్టూమ్స్‌: శివ-ఖాదర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రాంబాబు, ఛీఫ్‌ కో డైరెక్టర్‌: గోపి.

English summary
Vishnu Manchu Makes Sensational Remarks About Heroes, Throws A Challenge At Them
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu