»   » షాకవ్వొద్దు: తమ్ముడికి మంచు లక్ష్మి బర్త్ డే విషెస్ (ఫోటో)

షాకవ్వొద్దు: తమ్ముడికి మంచు లక్ష్మి బర్త్ డే విషెస్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి మంచు లక్ష్మి తన తమ్ముడు మంచు విష్ణుకు బర్త్ విషెస్ డిఫరెంటుగా తెలియజేసింది. ఆమె పోస్టు చేసిన ఫోటో చూడగానే కాస్త షాకయ్యేలా ఉన్నా....ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఇదొక ప్రతీక అని చెప్పొచ్చు. విష్ణు నాకు బ్రదర్ కంటే ఎక్కువ. తండ్రితో సమానం. నా విషయంలో బ్రదర్ లా కాకుండా తండ్రిలా కేర్ తీసుకుంటాడు. విష్ణు ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ విషెస్ తెలియజేసింది.

Happy birthday @iVishnuManchu who is more like a father than a brother. Here's to your health and happiness.

Posted by Lakshmi Manchu onSunday, November 22, 2015

ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు.. 1981 నవంబర్ 23న జన్మించిన మంచు విష్ణు తన 22వ ఏట విష్ణు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2007లో వచ్చిన ‘డీ' సినిమాతో మొదటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న విష్ణు ఆ తర్వాత వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెలుతున్నాడు. ఒక్క హీరోగానే కాకుండా 2010 లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్ పై కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు.

English summary
"Happy birthday iVishnuManchu who is more like a father than a brother. Here's to your health and happiness." Manchu Lakshmi said.
Please Wait while comments are loading...