»   » ఆ 11 నిమిషాలు బీభత్సం....రౌడీ’లో వర్మ న్యూట్రెండ్

ఆ 11 నిమిషాలు బీభత్సం....రౌడీ’లో వర్మ న్యూట్రెండ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సాధారణంగా ఏ సినిమాలో అయినా 3 నిమిషాలకు మించి హైఓల్టేజ్ యాక్షన్ పార్టు ఉండదు. కానీ దర్శకడు రామ్ గోపాల్ వర్మ 'రౌడీ' చిత్రంలో కొత్త ట్రెండు మొదలు పెట్టాడు. ఈ చిత్రంలో ఏకంగా 11 నిమిషాల పాటు హై ఓల్టేజ్ యాక్షన్ పార్టును బీభత్సంగా తెరకెక్కించాడట. మనం ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా డిఫరెంటు యాంగిల్స్‌లో ఈ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయట. ఈ విషయాలన్నీ ఇందులో నటిస్తున్న హీరో విష్ణు స్వయంగా వెల్లడించారు.

  ఈ విషయమై విష్ణు మాట్లాడుతూ...'ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. నేను ఇంత వరకు అలాంటి ఫైట్ సీన్ చేయలేదు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు రామ్ గోపాల్ వర్మదే. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఆయన ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. సినిమా చూస్తే వర్మ గొప్పతనం ఏమిటో మీకు అర్థం అవుతుంది' అన్నారు.

  Vishnu Manchu Praises RGV's 11-Minute Action Scene in Rowdy

  సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్లో డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

  మరో వైపు 'రౌడీ' చిత్రం కూడా వివాదంలో ఇరుక్కుంది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో, నటుడు మోహన్ నటించిన 'రౌడీ' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు మంగళవారం ఆందోళనకు దిగారు. రౌడీ సినిమాలోని సన్నివేశాలు ప్రజలను ప్రభావితం చేసేవిధంగా ఉన్నాయని వారు ఆరోపించారు.

  ఈ చిత్రం ద్వారా సమాజంలో రౌడీయిజం పెరిగిపోతుందని వారు తెలిపారు. రాజకీయ పరంగా రౌడీయిజాన్ని చెలాయించే అంశాలు ఈ సినిమా ఎక్కువగా ఉన్నందున 'రౌడీ' సినిమా విడుదలను నిలిపివేయాలని ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు నేతలు తెలిపారు.

  'రౌడీ' చిత్రంలో మోహన్‌బాబు, విష్ణు, జయసుధ, శాన్వి ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రౌడీ ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

  English summary
  Usually, action sequence will be less than 3 minutes affair in any films, but director Ram Gopal Varma, who is known for setting new trends, has broken the tradition by make a major detour in action sequence in Rowdy. By keeping the camera focused firmly on Mohan Babu and Vishnu Manchu performance for 11 minutes, RGV has turned this lavishly budgeted scene as one of its kind incredible action sequences ever made in a movie. The stunt scene before the interval is a spectacular sequence crafted by him, says Vishnu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more