హాలీవుడ్ అవకాశాన్ని రిజెక్ట్ చేసిన మంచు విష్ణు
విష్ణు తన ట్విట్టర్లో 'గుండ్ మార్నింగ్. హాలీవుడ్ మూవీ ఆడిషన్స్‌కి వెళ్లాను. సెలక్ట్ కూడా అయ్యాను. అయితే డేట్స్ కుదరక పోవడం వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. హాలీవుడ్ సినిమాకు సెలక్ట్ అయినప్పటి నుంచి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ' అని పేర్కొన్నారు.
ఇక సినిమాల్లో హీరోగా పనికి రాడు అనే సమయంలో 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టి చార్జ్ అయిన విష్ణు... ప్రస్తుతం వీరు పోట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రం ప్రస్తుతం 2వ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రంలో విష్ణు సరసన అందాల రాక్షసి ఫేం లావణ్య తిపాఠి హీరోయిన్ గా చేస్తోంది.
వీరు పోట్ల దర్శకత్వంపై విష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మనోజ్ నటించిన హిట్ ఫిల్మ్ 'బిందాస్'తో అతను డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అక్కినేని నాగార్జునతో 'రగడ' రూపొందించి వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు మూడో సినిమాని విష్ణుతో చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications












