చిరంజీవిని అవమానించినట్టే.. దిగజారుతున్నావు.. జీవితా రాజశేఖర్‌ను కొట్టించలేదా? నాగబాబుపై విష్ణు మంచు ఫైర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు కొన్ని గంటల గడువు ఉండగా మంచు విష్ణు ఓ వీడియోను రిలీజ్ చేశారు. శుక్రవారం మెగా బ్రదర్ నాగబాబు వీడియో రిలీజ్ చేసి విష్ణుపై తీవ్రంగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రకాశ్ రాజ్‌కు మద్దతు తెలియజేస్తూ విష్ణు మంచుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలపై మంచు విష్ణు ఘాటుగా స్పందిస్తూ..

ఓపిక పట్టాను.. ఆపేస్తారని అనుకొన్నా

ఓపిక పట్టాను.. ఆపేస్తారని అనుకొన్నా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగబోతున్నాయి. ఈ ఎన్నికపై ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల దృష్టి ఉండటమే కాకుండా ఎలాంటి ఫలితం రాబోతున్నదనే ఆసక్తి నెలకొని ఉందనే విషయాన్ని చాలా మంది ఫోన్లు చేసి చెబుతున్నారు. నా అపోజిషన్‌ ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్న ఒకరు, అలాగే సీనియర్ నటి నాపై, నా కుటుంబంపై తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తున్నారు. మా నాన్న మోహన్‌బాబును కూడా ఇందులోకి లాగుతూ చిల్లరగా మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా రోజులు ఓపిక పట్టి.. ఇక ముందు ఆపేస్తారని అనుకొన్నాను. కానీ అలా జరగకపోవడంతో నేను మీడియా ముందుకు వచ్చాను అని విష్ణు మంచు అన్నారు.

నాపై మీకు ఎందుకు చిన్నచూపు అంటూ

నాపై మీకు ఎందుకు చిన్నచూపు అంటూ

ఇటీవల నాగబాబు నన్ను పర్సనల్‌గా ఎటాక్ చేస్తున్నారు. అంకుల్.. నేను ఏం చేశానని నాపై కోపం. మా సంస్థలో నటించారు. మా కుటుంబం గురించి మీకు తెలుసు. మీ ముందే పెరిగాను. మీతో ఫోన్‌లో మాట్లాడే చనువు కూడా ఉంది. అయితే మీరు మద్దతిస్తున్న మేధావి కొద్ది నెలల క్రితం పవన్ కల్యాణ్ గురించి దారుణంగా మాట్లాడారు. దానికి మీరు తిడుతూ.. మీ స్టైల్‌లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అతడు మీ దృష్టిలో ఆ మేధావి మంచివాడు అయ్యాడు. నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు. మీరు నన్ను మాటలతో ఎటాక్ చేసిన దానికి కౌంటర్ ఇవ్వవచ్చు. కానీ అలాంటి పని చేయను అని విష్ణు మంచు తన వీడియోలో సున్నితంగా స్పందించారు.

మీ మేధావికి క్యారెక్టర్ లేదంటూ..

మీ మేధావికి క్యారెక్టర్ లేదంటూ..

మీ కంటే ఎక్కువ నాకు చిరంజీవి అంటే చాలా గౌరవం. మిమల్ని నేను విమర్శిస్తే.. ఆయనను అవమానించినట్టు అవుతుంది. అందుకే ఓ హద్దు వరకు మౌనంగా ఉంటాను. ప్రకాశ్ రాజ్‌, నాకు తెలుగు పరీక్ష పడితే నేను పాస్ కూడా కాదని అన్నారు. అది మీ అభిప్రాయం. కానీ వ్యక్తిగతంగా క్యారెక్టర్‌ పరంగా పరీక్ష పెడితే.. ఇండస్ట్రీలో నాకు ఎన్ని మార్కులు వస్తాయో ఇండస్ట్రీలో అడగండి.. అలాగే ఆయన క్యారెక్టర్ గురించి కూడా ఆయన నటించిన భాషలకు సంబంధించిన దర్శకులు, నిర్మాతలను అడగండి. నాలెడ్ఝ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్‌లెస్. ప్రధాని మోదీని విమర్శదగిన వ్యక్తి అంటూ పొగిడారు. అయితే మా నాన్న గురించి మాట్లాడవద్దు. నేను కొన్ని విషయాలు ప్రస్తావిస్తే బాగుండదు. మా కుటుంబంతో మంచి బంధం ఉంది. ఈ రోజు వచ్చింది కాదు ఆ రిలేషన్. మనమంతా ఇక ఫ్యామిలి అని విష్ణు మంచు అన్నారు.

వరుణ్ తేజ్‌ను లాగుతూ విష్ణు మంచు..

వరుణ్ తేజ్‌ను లాగుతూ విష్ణు మంచు..


నన్ను ఇంతగా విమర్శిస్తున్నారు. మీ కుటుంబంలో వరుణ్ తేజ్‌ను విమర్శిస్తే మీకు బాధగా ఉండదా? మాకు, మా నాన్నకు కూడా మనసు కష్టంగా ఉంటుంది. అయినా వరుణ్‌ను ఎట్టి పరిస్థితుల్లో విమర్శించను. వరుణ్ నాకు సోదరుడు. ఈ ఎన్నికల కోసం మీరు ఎందుకు ఇంతలా దిగజారుతున్నారు. మేము మీ ముందు పెరిగిన వాళ్లం. ఏదైనా తప్పు చేస్తే.. ఫోన్ చేసి తప్పు సరిదిద్దే అధికారం ఉంది. కానీ అలా చేయకుండా, మీ పెద్దరికం నిలుపుకోకుండా అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని విష్ణు మంచు అన్నారు.

జీవిత రాజశేఖర్‌ను కొట్టించలేదా?

జీవిత రాజశేఖర్‌ను కొట్టించలేదా?

ఇక మీ ఫ్యామిలీని, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా విమర్శిస్తే.. వారిపై అభిమానులతో దాడి చేయించే అలవాటు కూడా ఉంది. మీ ఫ్యాన్స్‌కు ఫోన్ నెంబర్లు ఇచ్చి తిట్టించే అలవాటు మీకు ఉంది. గతంలో రాజశేఖర్, జీవిత కారులో ప్రయాణిస్తుండగా, వారి పక్కన ఇద్దరు ఆడపిల్లలు ఉంటే.. కొట్టమని పంపించారు. మీడియా నిలదీస్తే.. మా ఫ్యాన్స్ కాదని తప్పించుకొన్నారు. ఇప్పుడు అలాంటివి మానేసి.. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నాపై ఎటాక్ చేస్తున్నారు. అయినా నేను పట్టించుకోను. రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఆశీర్వదించండి అంటూ విష్ణు మంచు ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X