ఆ ఫోటోలో ఉన్నది నా కొడుకు కాదు, అంతా ఫేక్: మంచు విష్ణు రిక్వెస్ట్
Recommended Video

తెలుగు సినీ నటుడు మంచు విష్ణు, వెరోనికా దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మంచు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతున్న వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు వారిని అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఎవరో అబ్బాయి ఫోటోను తన కొడుకుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని నమ్మవద్దని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు.

దయచేసి దీన్ని ఆపండి
తన కొడుకుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను షేర్ చేయడం ఆపాలని, ఆ ఫోటోలో ఉన్న బాబు తన బాబు కాదని మంచు విష్ణు తెలిపారు.

త్వరలో అసలు ఫోటో
త్వరలోనే తన కుమారుడి రియల్ ఫోటో అభిమానులతో పంచుకుంటానని, అప్పటి వరకు అభిమానులు, వెల్ విషర్స్ ఓపిక పట్టాలని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు. ఫేస్ ఫోటోలను స్ప్రెడ్ చేయడం ఆపాలన్నారు.

మంచు విష్ణు ఫ్యామిలీ
మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. తమ కుటుంబంలో ఇపుడు కొత్తగా మరో అబ్బాయి యాడ్ కావడంతో మంచు ఫ్యామిలీ సెలబ్రేషన్ మూడ్లో ఉంది.

మంచు విష్ణు మూవీస్
ప్రస్తుతం మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర' చిత్రంలో నటిస్తున్నారు. మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగులో విష్ణు గాయపడటంతో సినిమా లేటవుతుంది. ఈ ఏడాది ఈ చిత్రం విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











