twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూసుకెళ్తా : డేంజరస్ స్టంట్స్ చేస్తున్న విష్ణు (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మంచు విష్ణు త్వరలో 'దూసుకెళ్తా' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈచిత్రంలో విష్ణు పలు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని ఓ యాక్షన్ సీన్‌కు సంబంధించిన ఫోటో విడుదలైంది. దాదాపు 80 అడుగుల ఎత్తులో వెళ్లే జీప్ నుంచి విష్ణు జంప్ చేసే సీన్ ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉంది. ఇద్దరమ్మాయిలతో చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన కేచ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

    ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మాత...అందాల రాక్షసి ఫేమ్ లావణ్య హీరోయిన్. 24 ఫ్రేమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం టైటిల్ కి తగినట్లే విజయం వైపు దూసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.

    విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయింది కాబట్టే దూసుకెళ్తా టైటిల్ ఖరారు చేసాం. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.

    కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కళ: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌, సమర్పణ: అరియానా, వివియానా. కెరీర్ ఇక అయిపోయినట్లే అని అనుకుంటున్న తరుణంలో 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టిన విష్ణు తన రాబోయే సినిమాలపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. 'దూసుకెళ్తా' చిత్రంతో పాటు విష్ణు...తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

    English summary
    
 Vishnu Manchu performed dangerous stunt in his next movie ‘Doosukeltha’. Veeru Potla is directing this youthful comedy entertainer. ‘Andala Rakshasi’ fame Lavanya Tripathi is acting as heroine opposite Manchu Vishnu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X