అల్లు అర్జున్ రూట్ లోనే మంచు విష్ణు సైతం..
హైదరాబాద్ : అల్లు అర్జున్ కి మళయాళంలో మల్లు అర్జున్ అని పేరు. ఆయనకి అక్కడ చాలా డిమాండ్ ఉంది. ఆయన సినిమా హిట్, ప్లాప్ లకు సంభందం లేకుండా అక్కడి రిలీజ్ అవుతూంటాయి. తాజాగా జులాయి సైతం అక్కడ గజ పోకిరి గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ విజయం మరి కొంత మంది హీరోలకు ఉత్సాహాన్ని ఇస్తోంది. మంచు విష్ణు సైతం మళయాళ మార్కెట్ లోకి దూకుతున్నారు.
మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మలయాళంలోకి అనువదించబోతున్నారు. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాలోని పాటల్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికి మూడు పాటలు షూట్ పూర్తైంది. ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ..."ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.


Click it and Unblock the Notifications











