For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేనికైనా రెడీ’ సెన్సార్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చాలా కాలం తర్వాత మంచు హీరో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి తన ఎంట్రీ తన కెరీర్‌ని నిలబెట్టేదిగా ఉండాలనే కసితో 'దేనికైనా రెడీ' అంటూ రంగంలోకి దూకుతున్నాడు. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈచిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు.

    మంచు విష్ణు, హన్సిక మొత్వాని జంటగా ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై 'దేనికైనా రెడీ' చిత్రం రూపొందుతోంది. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులతో పాటు, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం అక్టోబర్ 24న విడుదలకు సిద్ధం అవుతోంది.

    ఈ చిత్రం గురించి దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మోహన్‌బాబు నటనను మరోసారి ఈ చిత్రంలో విష్ణు కామెడీలో చూడవచ్చని, పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రంగా రూపొందిందని, హీరో ఇంట్రడక్షన్ పాటను యువన్ శంకర్‌రాజా సరికొత్త బాణీ అందించగా రూపొందించామని, అలాగే హీరోహీరోయిన్ల డాన్స్‌లు థ్రిల్ కలిగించేలా వుంటాయని తెలిపారు.

    కామెడీ చిత్రం అంటే ఈ విధంగా కూడా చేయవచ్చా అని ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు అంటారని, తానే హీరోగా చేద్దామనుకున్న కథతో విష్ణు హీరోగా చేశామని, చక్రి అద్భుతమైన సంగీతాన్ని అందించారని, నిర్మాత మోహన్‌బాబు తెలిపారు. తనకు నచ్చే చిత్రాలు కాకుండా తనకు నప్పే చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చానని, అందులో భాగంగా తొలి చిత్రంగా దేనికైనా రెడీ సినిమా నిర్మించామని హీరో విష్ణు అంటున్నారు.

    English summary
    Vishnu Manchu’s comedy entertainer ‘Dhenikaina Ready’ has received a U/A certificate from the censors after screening was completed yesterday. The movie is now gearing up for a big release on October 24th worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X