నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న మంచు విష్ణు దంపతులు... కంట్రోల్ లేదంటూ నెటిజన్ల ట్రోలింగ్!
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు, విరానికా దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇప్పటికే వీరికి అరియానా, వివియానా అనే ఇద్దరు కూతుళ్లతో పాటు అవ్‌రామ్ అనే కుమారుడు ఉన్నాడు. త్వరలో వీరు మరో కూతురుకి జన్మనివ్వబోతున్నారు.
ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం వీరు అమెరికాలోని విరానికా హోమ్ టౌన్‌లో ఉన్నారు. ఇక్కడ తమ ఫేవరెట్ ప్లేసులో దిగిన ఫిక్ షేర్ చేస్తూ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ ఫోటోలో విరానికా బేబీ బంప్‌తో కనిపించారు.
హ్యాపీ మూడ్లో మంచు విష్ణు దంపతులు
విష్ణు ఈ ట్వీట్ చేయగానే మంచు ఫ్యామిలీ అభిమానులు వీరిని విష్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. కొందరు మాత్రం వీరు ఎడతెరిపి లేకుండా పిల్లలను కంటున్నారు, కుటుంబ నియంత్రణ పాటించడం లేదంటూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

అనాధను దత్తత తీసుకోవచ్చుగా...
మంచు విష్ణు చేసిన ట్వీట్ మీద ఓ అభిమాని స్పందిస్తూ.. ‘ఇది మంచి విషయమే, ఇండియాకు మీ లాంటి బిజినెస్ మైండ్స్ కావాలి, కానీ మళ్లీ బిడ్డను కనే బదులు ఎవరైనా అనాధను దత్తత తీసుకోవచ్చుకగా బ్రదర్. అలా ఒకసారి ట్రై చేయండి. ఈ విషయంలో మీ సిస్టర్ మంచు లక్ష్మిని అనుసరించండి' అని సూచించారు.
ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మీకు తెలియదా?
‘‘సార్.. ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్ అని ఒకటి ఉంది తెలుసా? మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా నడుస్తుంది.'' అంటూ కొందరు ఘాటుగానే సెటైర్లు వేశారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మంచు విష్ణు, విరానికా బిడ్డలంతా కూడా అమెరికా పౌరులే. ఇండియన్ పాపులేషన్లో వారు లెక్కకు రారు అని మరికొందరి వాదన.
ఫన్నీ మీమ్స్
కొందరు ఈ దంపతులు నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతుండటంపై ఫన్నీ మీమ్స్ ఫోస్ట్ చేస్తున్నారు. ఇలా విమర్శిస్తున్న వారి విషయంలో మంచు విష్ణు, వారి కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. విష్ణు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘ఓటర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

సినిమాల కంటే వ్యాపారం మీదే
సినిమా రంగం అంతగా కలిసి రాక పోవడంతో మంచు విష్ణు తన ఫోకస్ అంతా కూడా వ్యాపారాలపై పెట్టాడు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవ్వకుండా అడపా దడపా సినిమాలు చేస్తూనే బిజినెస్ వ్యవహాలను చూసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











