వాళ్లు నన్ను తొక్కేయాలని చూశారు: ఆ డైరెక్టర్లపై మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్

By Manoj Kumar P

విలక్షణ నటనకు తోడు తనదైన డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్నింటికీ మించి నిర్మాతగా రాణిస్తూ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన పిల్లలు మంచు లక్ష్మీ ప్రసన్న, మనోజ్ కుమార్, విష్ణు‌లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే, ఈ ముగ్గురికీ సరైన బ్రేక్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో విష్ణు టాలీవుడ్ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం.!

హిట్ లేక సతమతం.. ముగ్గురిదీ అదే తీరు

హిట్ లేక సతమతం.. ముగ్గురిదీ అదే తీరు

మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు మంచు విష్ణు. అతడి కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. ‘ఢీ' అనే సినిమా మినహా సరైన హిట్ పడలేదు. ఇక, మనోజ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే తయారైంది. రెండు మూడు సినిమాలు మినహా ఆకట్టుకున్నవి లేవు. అలాగే, లక్ష్మీ ప్రసన్నకు కూడా ట్రాక్ రికార్డ్ ఏమంత బాగోలేదనే చెప్పాలి.

రెండు విధాలుగా నష్టపోయిన మంచు విష్ణు

రెండు విధాలుగా నష్టపోయిన మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. దీంతో అయినప్పటికీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి కొన్ని సినిమాలు నిర్మించాడు. అందులో అతడు నటించిన వాటితో పాటు మిగతా హీరోల చిత్రాలూ ఉన్నాయి. ఇవేమీ విష్ణుకు లాభాలు తెచ్చిపెట్టలేదు.

ఒకేరోజు నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించాడు

ఒకేరోజు నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించాడు

వరుస పరాజయాలను ఎదుర్కొంటోన్న మంచు విష్ణు.. ఒకేరోజు ఏకంగా నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించి ఔరా అనిపించాడు. ఆ సమయంలో ‘‘ఈరోజు నాలుగు ప్రాజెక్టులను మొదలుపెట్టాను. అందులో రెండు నేను నటించేవి కాగా, మరొకటి వెబ్ సిరీస్, అలాగే ఇంకొకటి ఫీచర్ ఫిల్మ్. నాకు లక్ కలిసి రావాలని కోరుకుంటున్నాను. రెండు సంవత్సరాలు చేతి నిండా పనే'' అని ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్ బయోపిక్‌తో భయపెట్టబోతున్నాడు

ఎన్టీఆర్ బయోపిక్‌తో భయపెట్టబోతున్నాడు

మంచు విష్ణు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ‘మోసగాళ్లు' ఒకటి. అతడే హీరోగా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. అలాగే, ‘చదరంగం' పేరిట వస్తున్న వెబ్ సిరీస్.. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో శ్రీకాంత్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ పార్టీని టార్గెట్ చేసే దీన్ని రూపొందించారని ప్రచారం జరుగుతోంది.

ఆ డైరెక్టర్లపై మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్

ఆ డైరెక్టర్లపై మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు విష్ణు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన తెరంగేట్రం గురించి మాట్లాడుతూ.. ‘నన్ను లాంచ్ చేసే సినిమాకు దర్శకుడు దొరకలేదు. మోహన్ బాబు కొడుకు ఫస్ట్ సినిమా అనగానే అందరూ భయపడిపోయారు. కోలీవుడ్ వాళ్లు కూడా ముందుకు రాకపోతే కేరళ నుంచి తీసుకొచ్చా'మని చెప్పాడు.

Recommended Video

Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
ఓ టైమ్‌లో వాళ్లు నన్ను తొక్కేయాలని చూశారు

ఓ టైమ్‌లో వాళ్లు నన్ను తొక్కేయాలని చూశారు

అదే విషయాన్ని వివరిస్తూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘నా కెరీర్ ఆరంభంలో చాలా మంది దర్శకులు నన్ను తొక్కేయాలని చూశారు. కానీ, నిర్మాతలు మాత్రం ప్రోత్సహించారు. అలాంటి సమయంలోనే శ్రీను వైట్ల గారు నాకు బ్రేక్ ఇచ్చారు. ఏ విషయమైనా దర్శకుల చేతిలోనే ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు మంచు వారి అబ్బాయి విష్ణు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X