రామ్ చరణ్, రాణా బాటలో.. మంచు హీరో!

By Bojja Kumar

హైదరాబాద్ : హీరో మంచు విష్ణు త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? రామ్ చరణ్, రాణా బాటలో బి టౌన్‌లో అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలవుడ్ నుంచి వినిపిస్తున్న వార్తల బట్టి దర్శకుడు మణిశంకర్ రూపొందించబోయే చిత్రంలో విష్ణు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగలో రూపొందుతున్న నేపథ్యంలో ఇందులో విష్ణును కూడా హీరోగా ఎంపిక చేసుకున్నారట.

ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్డ్ గేమ్(పేకాట) నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, నలుగురు కుర్రాళ్ల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని, ఈచిత్రంలో విష్ణు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కార్డ్ ప్లేయర్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆయన సినీ కెరీర్ విషయానికొస్తే...వరుస ప్లాపుల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విష్ణు త్వరలో 'దేనికైనా రెడీ' చిత్రం ద్వారా ప్రక్షకుల ముందుకు రాబోతున్నాడు. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు.

మరో వైపు 'అసెంబ్లీ రౌడీ' చిత్రం రమేక్‌లో నటించేందుకు ప్రతయ్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో విష్ణు పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పోలి ఉంటుందని, ప్రస్తుతం రాజకీయాల ప్రస్తావిస్తూ ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X