twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు విష్ణు చెప్పేదంతా అబద్దం

    By Srikanya
    |

    హైదరాబాద్: విష్ణు చెప్పిందంతా అబద్ధం. వాళ్ల ఇంటికి ఇంకా అర ఫర్లాంగు దూరంలో ఉండగానే.. పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేశారు. దాడులు చేయడాన్ని మీడియా చిత్రీకరిస్తుండగా మోహన్‌బాబు ఇంటి ముందు సీన్ మారిపోయింది.. వాళ్లంతటవాళ్లే లైటు పగలకొట్టుకుని, గేటు ముందు రాళ్లు వేసుకున్నారు అని బ్రాహ్మణులు మీడియా వద్ద వాపోయారు. అప్పటివరకూ కర్రతో వీరంగం వేసిన సెక్యూరిటీ గార్డు.. చొక్కా చింపుకొని, తనపై బ్రాహ్మణులు దాడి చేశారంటూ కెమెరా ముందుకొచ్చాడని ఆరోపించారు. 'మా సెక్యూరిటీ గార్డు చేయి విరిగిపోయింద'ని విష్ణువర్ధన్ అతడికి వత్తాసు పలికాడన్నారు.

    దేనికైనా రెడీ చిత్రంలో తమ వర్గాన్ని అవమానపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని నటుడు మోహన్‌బాబు ఇంటిముందు ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న బ్రాహ్మణ ప్రతినిధులపెై ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడిచేయగా, పలువురు గాయాల పాలయ్యారు. గత నాలుగు రోజులుగా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు చిత్రంలోని పలు అభ్యం తకర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. సోమవారం మోహన్‌బాబు ఇంటి ముందు ధర్నా చేసిన సమయంలో, నెల్లూరులో ఉన్న మోహన్‌బాబు తాను ఉంటే చందాలు ఇచ్చి పంపించేవాడిని అన్న వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

    రాత్రి దాడి అనంతరం మంచు విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడుతూ... "డోర్లు పగలకొట్టారు. లైట్లు పగలకొట్టారు. రాళ్లు విసిరారు. ఏం గమ్మునుంటుంటే చేతగానివాళ్లలా కనిపిస్తున్నామా? వీళ్లొచ్చి మా ఇంటి ముందు ధర్నా చేస్తారా? సినిమా సినిమాగా చూడాలి. ఏం కేరళలో, కర్ణాటకలో సినిమా రిలీజైంది అక్కడెందుకు గొడవలు చేయట్లా? ఇక్కడ కరెక్ట్‌గా ఐదారు మంది చేస్తున్నారు. ఇంటిపైకి వచ్చారంటే.. ఎవ్వరైనా సరే ఖబడ్దార్. సిటీలో తిరగడానికి మీరంతా భయపడాలి చెప్తున్నా! ఇంట్లో మా అమ్మ ఉన్నారు. నేను బయటున్నా. సెక్యూరిటీవాళ్లున్నారు కాబట్టి సరిపోయింది. నేను ఇంట్లో ఉండుంటే జరిగేది వేరే. ఎవరో ఐదారుగురి కోసం మేం భయపడాలా? అలాంటి జన్మ ఈ జన్మలో మాకక్కర్లేదు. హేయ్.. ఖబడ్దార్ జాగ్రత్త. ఇళ్లపైకి వచ్చారంటే మాత్రం బాగుండదు" అన్నారు.

    English summary
    "Look the protestors pelted stones at our residence and damaged widows and even broke the door. We have security guards just for these kind of situations. My mother and sister were the only ones at home and they were under attack. So our security guards along with workers from our shop and some union members of the Film Chambers joined in to rein in the situation," said Vishnu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X