పేరు పెట్టండి-బహుమతి పొందండి
విష్ణు హీరోగా నాగార్జున ప్రత్యేక పాత్రలో రూపొందుతున్న చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకం సంస్థ ఈ చిత్రం పేరును నిర్ణయించడానికి ప్రేక్షకులకు అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్నా పిక్చర్స్ అధినేత మోహన్ బాబు వెల్లడించారు. సీతారాంభాగ్ లో ఈ సినిమా షూటింగ్ స్పాట్ లోనే ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఈ సినిమాకోసం 1.కృష్ణార్జున 2.కృష్ణార్జునులు 3.మిత్రమా పేర్లు అనుకున్నామని ఇందులో ఏదో ఒకదానిని ఫైనల్ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రేక్షకులు విష్ణు స్పేస్ 1లేదా2లేదా3 అని టైప్ చేసి 5600667 అనే నంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలని ఆయన కోరారు. విజేతలలో ఏడుగురిని ఎంపిక చేసి బహుమతులను అందజేస్తామని మోహన్ బాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











