విష్ణుని 'వస్తాడు నా రాజు' అని కలవరిస్తున్న తాప్సీ
మంచు విష్ణు వర్ధన్ ప్రస్తుతం వస్తాడు నా రాజు అనే టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. హేమంత్ మధుకర్ అనే నూతన దర్శకుడు డైరక్షన్ రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు తమ కొత్త బ్యానర్ 24 ప్రేమ్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. వైవియస్ చౌదరితో చేసిన సలీం ప్లాప్ కావటంలో ఈ చిత్రం లాంచింగ్ ని హంగు, ఆర్బాటం లేకుండా చేసి దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నారు. విష్ణు బార్య వెర్నొకా మొదటిసారిగా దగ్గరుండి ఈ చిత్రం ప్రొడక్షన్ చూసుకుంటోంది. తాప్సీ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు కొత్త గెటప్, లుక్ తో కనపడనున్నారని తెలుస్తోంది. ఇక హేమంత్ మధుకర్ గతంలో 'ఫ్లాట్' అనే థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే అతను తెలుగువాడే...రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వశాఖలో పనిచేసాడు.
ఇలియానా విష్ణువర్ధన్ సలీం వైవియస్ చౌదరి మోహన్ బాబు వస్తాడు నా రాజు హేమంత్ మధుకర్ vishnuvardhan saleem ileana yvs chowdary mohan babu hemanth madhukar


Click it and Unblock the Notifications