మంచు విష్ణు 'డైనమైట్‌' మేకింగ్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ :మంచు విష్ణు హీరో గా నటిస్తున్న చిత్రం 'డైనమైట్‌'. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకుడు. ప్రణీత హీరోయిన్. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదలైంది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం కథేమిటంటే...

భాధ్యతగల పౌరుడుగా అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ఈ తరం కుర్రాడుశివాజీకృష్ణ అలియాస్ శివ(మంచు విష్ణు). అతను ఓ రోజు రోడ్డుమీద ఓ అమ్మాయిని పోకిరీలనుంచి రక్షించి, అనామిక దాసరి(ప్రణీత)దృష్టిలో పడతాడు. ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి...అతనితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ తర్వాత రెస్టారెంట్ లో కలుసుకుని, ఆమె ప్లాట్ కు వెళతారు. అక్కడ ఆమె రిఫ్రెష్ అవుతున్నప్పుడు ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. వెంటనే ఎలర్టైన శివ..వెంటనే పోలీసులుకు ఇన్ ఫార్మ్ చేసినా ఫలితం లేకపోవటంతో తనే రంగంలోకి దిగి ఆమెను వెతకటం మొదలెడతాడు.

ఆ క్రమంలో ఆమె ఛానెల్ 24 సీఈవో రంగనాధ్ దాసరి (పరుచూరి వెంకటేశ్వరరావు)కూతురు అని తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని విషయం ఏంటి అని అడుగుదామనుకునేలోపు ఆయన హత్యకు గురి అవుతాడు. అక్కడ కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. అసలు ఈ కిడ్నాప్ కు, ఆమె తండ్రి హత్యకు అసలు కారణమేంటి..దీనికి యూనియన్ మినిస్టర్ రిషిదేవ్ (జెడి చక్రవర్తి) కి సంభంధం ఏమిటి... ఎలా ఈ విషయాలన్నీ సామాన్యుడైన శివ ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకుని, ఆమెను ఎలా రక్షించాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Vishnu’s DYNAMITE Movie Making Video

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. విష్ణు నటన, ఆయన లుక్‌ ఆకట్టుకొంటున్నాయి. చెవిపోగు, టట్టూతో విష్ణు కొత్తగా కనిపిస్తారిందులో. విజయ్‌ నేతృత్వంలో తెరకెక్కించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ'' అన్నారు.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మంచు విష్ణు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్రణీత హీరోయిన్‌గా న‌టిస్తుంది. మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్టర్ విజ‌య్ అందించిన యాక్షన్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్షన్ వాల్యూస్ హైలైట్ .ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌ ముత్యాల, సంగీతం: అచ్చు, ఆర్ట్‌: రఘు కులకర్ణి, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌ శేఖర్‌.

‘వెన్నెల', ‘ప్రస్థానం', ‘ఆటోనగర్ సూర్య' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట . థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి'కి రీమేక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X