ఆ ఒక్క చిత్రమే సంక్రాతికి..మరి మిగతావి
సంక్రాంతి సెంటిమెంట్ మెల్లిగా పరిశ్రమలో తగ్గుతున్నట్లుంది.ఈ సంక్రాంతికి విష్ణు,ఇలియానా కాంబినేషన్ లో వస్తున్న సలీం ఒక్కటే రిలీజ్ అయ్యేటట్లు ఉంది. ఈ చిత్రాన్ని వైవియస్ చౌదరి చాలా కాలంగా చెక్కుతున్నారు. ఇక బాలయ్య సింహా చిత్రం సంక్రాంతికి అని చెప్తున్నా అప్పుటికి రెడీ అయ్యి రిలీజయ్యే వాతావరణం కనపడటం లేదు. బోయపాటి శ్రీను మాత్రం సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాడంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రం డిసెంబర్ 18 న రిలీజ్ కానుంది. నాగార్జున రమ్మీ చిత్రం ఆయనకు సెంటిమెంట్ అయిన డిసెంబర్ నెలలోనే రానుంది. అల్లు అర్జున్ ఆర్య చిత్రం కూడా డిసెంబర్ లో వస్తోంది. ఇక వెంకటేష్ నమో వెంకటేశ ఆయనకు సెంటిమెంట్ రోజైన పిబ్రవరి 18న రిలీజ్ కానుంది. ఆ రోజే రాజా,సంక్రాంతి,మల్లీశ్వరి చిత్రాలు రిలీజై విజయం సాధించాయి.వీటితో బాటు రామానాయుడు మనవడు రాణాని పరిచయం చేస్తూ రానున్న లీడర్ డిసెంబర్ 24 న వస్తోంది. అలా చాలా సినిమాలు సంక్రాంతి సెంటిమెంట్ నుంచి తప్పుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











