విష్ణు 'సలీం'కు ఇది కోలుకోలేని దెబ్బ
విష్ణు, ఇలియానా కాంబినేషన్ లో రిలీజైన సలీం చిత్రం మొటటి షో తోటే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇరవైమూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం ఇలా మిజరబుల్ పరిస్దితికి దిగజారిందని ఓ వైపు ఆందోళన చెందుతున్న నిర్మాతలకు తెలంగాణాలో షో ఆపుచేయటం కోలుకోలేని దెబ్బ అయింది. టీవీల్లో ఈ చిత్రం కోసం ఖర్చుపెడుతూ చేస్తున్న ప్రమోషన్ కి అర్ధం లేకుండా పోతుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. మోహన్‌బాబు సమైక్యాంధ్రకు సమర్ధించటంతో ఆయన కుమారుడు విష్ణు నటించిన 'సలీం'పై ఈ ఎఫెక్ట్ పడింది.
పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మంలలో 'సలీమ్' ప్రదర్శనను కూడా అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు దహనం చేసి థియేటర్ల ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయమై మోహన్ బాబు మాట్లాడుతూ.."థియేటర్లపై దాడులు చేసేవాళ్లు అభిమానులు కాదు...మూర్ఖులు. వీరు థియేటర్లను ధ్వంసం చేసి సాధించేదేమీ లేదు. సినీ రంగానికి ప్రాంతీయ భేదం లేదు. థియేటర్లపై ఎక్కడ, ఎవరు దాడి చేసినా...ఖండిస్తాను" అని తెలిపారు. ఇక కోస్తాలో విజయశాంతి సినిమాపై పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిఘటన సినిమా రీళ్లను తగలబెట్టడం కొత్త మలుపు. ఏదైమైనా అసలే అంతంతమాత్రంగా టాక్ తెచ్చుకున్న ఆర్య 2, సలీం చిత్రాలకు ఇది ఇది ఇబ్బందికర పరిస్ధితే.


Click it and Unblock the Notifications











