twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు విష్ణు నెక్ట్స్ చిత్రం ఖరారు..దర్శకుడు ఎవరంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ : చాలా కాలం గ్యాప్ తర్వాత 'దేనికైనా రెడీ'తో విజయం సాధించిన హీరో మంచు విష్ణు. వివాదం చెలిరేగినా విజయంతో ముందుకెళ్తున్న మంచు విష్ము తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఈ సారి చేసే చిత్రాలు ఖచ్చితంగా తనకు విజయం సాధించాలనే పట్టుదలగా ఉండటంతో వెంటనే ఓకే చేయలేదు. అయితే తాజాగా వీరూపోట్లతో చిత్రం కమిటయ్యారని సమాచారం.

    ఆ మధ్యన మీడియాతో మాట్లాడుతూ...'దేనికైనా రెడీ'తర్వాత స్క్రిప్ట్ నచ్చితేనే తదుపరి సినిమాకి రెడీ చెబుతాను అన్నారు విష్ణు. ఈ ఆలోచనలో భాగంగా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలిసింది. వీరు పోట్ల కాంబినేషన్‌లో తాజాగా సినిమా చేయడానికి విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మనోజ్‌తో 'బిందాస్' వంటి హిట్ చిత్రానికి, నాగార్జునతో 'రగడ' వంటి భారీ చిత్రాలకి వీరు పోట్ల దర్శకత్వం వహించిన వహించారు. దాంతో ఈ కొత్త కాంబినేషన్ పైనే మంచి అంచనాలు ఉండనున్నాయి.

    ప్రస్తుతం వీరు పోట్ల కొంత కాలంగా ఈ విభిన్నమైన స్క్రిప్టును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ కథ విష్ణుకి బాగా నచ్చి డేట్స్ ఇచ్చాడంటున్నారు. డిసెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఇక ఈ దీపావళి పండుగను ఎప్పటికన్నా రెట్టింపు ఆనందంగా జరుపుకున్నానని విష్ణు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆరియానా, వివియానాలంటూ తన ముద్దుల కుమార్తెల గురించి చెప్పారు.

    'దేనికైనా రెడీ'సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే వీరు పోట్ల దర్శకత్వంలో చేయబోయే తన తదుపరి చిత్రానికి సంబంధించిన గెటప్, కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసుకునే పనిలో విష్ణు నిమగ్నమయ్యారు. ఇక తనకు 'దేనికైనా రెడీ'నుంచి ఇక తనకు వరస విజయాలు ప్రారంభమయ్యినట్లే అంటున్నారు. ఇన్నాళ్లకు మంచు విష్ణుకు బ్రేక్ వచ్చిందంటున్నారు.

    English summary
    Manchu Vishnu who scored a hit with Denikaina Ready is biding his time before signing his next film. According to latest information Vishnu gave green signal to Veeru Potla after hearing a script which attracted him. Buzz is Veeru Potla worked hard on creative script suited for Vishnu for quite some time. Entertaining elements in the scrpit attracted Vishnu who readily agreed to do the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X