నవదీప్ ఎంకరేజ్ తోనే..పంజా దర్శకుడు
పంజా దర్శకుడు విష్ణు వర్దన్ తొలి చిత్రం హీరో నవదీప్. ఆ విషయాన్ని రీసెంట్ గా'అలీబాబా ఇంట్లో అందరూ దొంగలు' ఆడియో పంక్షన్ లో గుర్తు చేసుకుంటూ...నాకు నవదీప్ మంచి స్నేహితుడు. నేను తమిళంలో దర్శకత్వం వహించిన తొలి సినిమాకు తనే హీరో. నేను మొదటిసారి కథ రాసుకున్నప్పుడు హీరోలెవరూ అవకాశం ఇవ్వలేదు. నవదీప్ నాకు ఆ అవకాశం ఇచ్చాడు..ఆయనే నన్ను ఎంకరేజ్ చేసారు ' అని చెప్పారు.
అలాగే ఈమధ్య నేను దర్శకత్వం వహించిన 'పంజా'ని హిట్ చేసి ఆదరించారు. మంచి కలెక్షన్లు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. నవదీప్ మాట్లాడుతూ.. .'తమిళంలో నా మొదటి సినిమాకు దర్శకుడు విష్ణువర్ధనే. తెలుగులో 'కలిసుంటే'గా రిలీజైంది. కాలక్రమేణా తను పెద్ద దర్శకుడు అయ్యాడు. 'పంజా' కూడా హిట్ అయింది. ఇక్కడ తను సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'నని అన్నారు. ఇక 'అలీబాబా ఇంట్లో అందరూ దొంగలు' చిత్రంలో విష్ణు వర్ధన్ సోదరుడు కృష్ణ హీరో. 'ఆలీబాబా' అనే తమిళ చిత్రాన్ని 'అలీబాబా ఇంట్లో అందరూ దొంగలు' పేరుతో తెలుగులో వస్తోంది. శ్రీరమణ ఫిలిమ్స్ పతాకంపై వి. రమణ, వి. జ్యోతిలాల్ అనువదిస్తున్నారు. చిత్రానికి నిలాన్ కె. శేఖర్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











