హైదరాబాద్: సినీనటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణువర్ధన్ బాబు వివాహం ముఖ్యమంత్రి సోదరుడు సుధాకర్ రెడ్డి కుమార్తె వెరోనికతో ఘనంగా జరిగింది. బాలయోగి స్టేడియంలో జరిగిన వివాహనికి ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేష్ తో పలువురు సినీ నటీనటులు హాజరయ్యారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు కాంగ్రెస, టిడిపి నేతలతో పలువురు రాజకీయ నాయకులు ఈ వివాహానికి హాజరైనారు.