twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉత్తమ నటుడిగా విష్ణువర్దన్, నటిగా అను ప్రభాకర్

    By Srikanya
    |

    కర్ణాటక ముఖ్యమంత్రి డీ.వీ.సదానందగౌడ బుధవారం 2009-10వ సంవత్సరానికి గాను కన్నడ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. అత్యుత్తమ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ (ఆప్తరక్షక), అత్యుత్తమ నటిగా అను ప్రభాకర్ (పరీక్షె) ఎంపిక కాగా అత్యుత్తమ మొదటి అత్యుత్తమ చిత్రంగా రసఱుషి కువెంపు, రెండవ అత్యుత్తమ చిత్రంగా మనసారె ఎంపికైనట్లు తెలిపారు. సీనియర్ నటుడు ద్వారకేష్ నేతృత్వంలోని అవార్డు ఎంపిక కమిటీ 54 చిత్రాలను తిలకించి సర్కార్‌కు సిఫారసు చేసినట్లు తెలిపారు. అత్యుత్తమ సామాజిక చిత్రంగా శబరి, మొదటి ఉత్తమ బాలల చిత్రంగా కిన్నెరబాల ఎంపికైనట్లు చెప్పారు.

    ఉత్తమ పోషక నటుడిగా నీనాసం, ఉత్తమ పోషక నటిగా చంద్రకళ, ఉత్తమ బాల నటుడిగా మాస్టర్ చిరంజీవి, ఉత్తమ బాల నటిగా బేబీ మధుశ్రీ, ఉత్తమ నేపథ్య గాయనిగా లక్ష్మి నటరాజ్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా టిప్పులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇక అవార్డు వచ్చిన ఆప్తరక్షక చిత్రాన్ని తెలుగులో నాగవల్లిగా వెంకటేష్ రీమేక్ చేసారు. బెల్లంకొండ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు.

    English summary
    The 2009-2010 state film awards were announced on Wednesday at Vidhana Soudha. Rithwick Simha won the best director for Rasa Rushi Kuvempu. With the best actor award going to Dr Vishnuvardhan posthumously for Aaptharakshaka, the film industry paid its respects to the legendary filmstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X