అభిమానంతో..యాడ్ ల్యాబ్ పై దాడి..40 సిటీ బస్సులు ధ్వంసం
మా హీరో చనిపోయాడని ప్రభుత్వం సంతాపదినం ప్రకటిస్తే మీరు సినిమా హాలు రన్ చేస్తారా అంటూ యాడ్ ల్యాభ్స్ ధియోటర్స్ పై విష్ణు వర్ధన్ అభిమానులు నిన్న దాడి చేసారు. మంగళూరులో ఈ సంఘటన భారత్ మాల్ వద్ద ఉన్న యాడ్ ల్యాబ్స్ మల్టీఫ్లెక్స్ లో చోటు చేసుకుంది. కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ హార్ట్స్ స్ట్రోక్ తో మరణించగా సంతాపంగా నివాళులు అర్పిస్తూ అన్ని ధియోటర్స్ బంద్ చేసారు. అయితే రిలియన్స్ కి చెందిన యాడ్ ల్యాబ్స్ వారు మాత్రం తెరిచి హిందీ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఇది గమనించిన అభిమానులు భారీ ఎత్తున వెళ్లి నినాదాలు చేస్తూ దాడిచేసారు. ఆ సమయంలో అమీర్ ఖాన్ తాజా చిత్రం త్రి ఇడియట్స్ హౌస్ ఫుల్ గా నడుస్తోంది.
ఇక నిన్న (బుధవారం) విష్ణు వర్ధన్ భౌతిక కాయాన్ని బెంగళూరులోని జయనగరలో గల నివాసానికి తరలించారు. తెల్లారేసరికి విష్ణువర్ధన్ మరణవార్త దావానలంలా వ్యాపించింది. దాంతో శోకతప్తులైన అభిమానులు తమ హీరో కడసారి చూపు కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో పోలీసులు సుమారు 20 సార్లు లాఠీచార్జి చేశారు. దీంతో అభిమానుల ఆగ్రహానికి 40 సిటీ బస్సులు సహా వంద వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా ప్రజల సంద ర్శనార్థం విష్ణువర్ధన్ పార్థివ శరీరాన్ని బసవనగుడిలోని నేషనల్ కళాశాల మైదానంలో ఉంచారు. సాయంత్రం ఉత్తరహళ్లిలోని అభిమాని స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.


Click it and Unblock the Notifications











