ఫస్ట్ టైమ్ మంచు విష్ణుతో రొమాన్స్ చేయనున్న దేశముదురు...!
మోహన్ బాబు తనయుడు విష్ణు ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమధ్య వచ్చిన 'డీ' సినిమా తర్వాత మళ్లీ అతనికి సక్సెస్ లేదు. ఈ నేపథ్యంలో ఓ వినోదాత్మక కథను తన తదుపరి చిత్రానికి ఎంచుకున్నాడు. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. డిసెంబర్లో షూటింగు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, ఇందులో విష్ణు సరసన హన్సిక కథానాయికగా నటిస్తుంది. కందిరీగ" తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన హన్పిక ఈ సినిమాకోసం కొంచెం సన్నబడే విషయంలో బిజీగా ఉందట. కాగా విష్ణు సరసన నటించడానికి హన్సిక, భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకుంటోందట. హన్పికతో పాటు మరో హీరోయిన్ ఈ చిత్రం లోనటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో విష్ణు తండ్రి మోహన్ బాబు ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడని సమాచారం. కాగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించే ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











