పవన్ ‘పంజా’ హిట్ అయితే మరో సూపర్ స్టార్ తో రీమేక్...!?
'పంజా" సినిమా ఆడియో ఇటీవలే హైదరాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ స్కేల్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మార్కెట్ లోకి విడుదలైన ఈ చిత్రం పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం పవన్ మునుపటి సినిమాలకంటే కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో మెగా అభిమానులు కొత్తగా ఫీలవుతున్నారు. ఈ అల్బమ్ లో పంజా టైటిల్ సాంగ్ కి శ్రోతల నుండి మంచి ఫీడ్ బ్యాక్ లభిస్తుంది. ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన రావడంతో ఈ సినిమాకి ఇంతకు ముందున్న క్రేజ్ ఇప్పుడు అమాంత పెరిగిపోయింది.
పవన్ కల్యాణ్ కథానాయకుడుగా, సారజెన్ దియాస్, అంజలి లావెనాయా కథానాయికలుగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'పంజా' సినిమా డిసెంబర్ లో బారీగా విడుదలకు సంసిద్దమౌతోంది. ఈ చిత్రం మీద తమిళ హీరో అజిత్ మనసు పారేసుకున్నాడట. అందుకే, ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నాడని సమాచారం. ఈ విషయంపై దర్శకుడు విష్ణువర్ధన్ తో చర్చించాడనీ, ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉన్నాడనీ తెలుస్తోంది.
ఈ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశాడట. అయితే, ఈ రీమేక్ అన్నది తెలుగు వెర్షన్ విజయం మీద ఆధారపడి వుంది. హిట్ అయితే, ప్రొసీడ్ అవ్వాలనీ, లేకపోతే మరొక సబ్జెక్ట్ చూసుకోవాలనీ వీళ్లిద్దరూ డిసైడ్ అయ్యారని అంటున్నారు. మొదట్లో అసలు 'పంజా'ని తమిళంలోకి డబ్ చేద్దామని నిర్మాతలు భావించారు. అయితే, పవన్ డబ్బింగ్ కి అంతగా అక్కడ మార్కెట్ లేకపోవడంతో ఆ యోచన విరమించుకున్నారని సమాచారం.!


Click it and Unblock the Notifications











