twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విష్ణు సలీమ్ చిత్రం రిలీజ్ ఇవాళ కాదు

    By Srikanya
    |

    మంచు విష్ణువర్ధన్, ఇలియానా కాంబినేషన్ లో దర్శకుడు వైవియస్ చౌదరి రూపొందించిన సలీం...దుమ్ము రేపుతాడు చిత్రం ఈ రోజు(శుక్రవారం)రిలీజ్ కావటం లేదు. ఈ మేరకు నిర్మాత మోహన్‌ బాబు మీడీయాకు ప్రకటన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "అనివార్య కారణాల వల్ల చిత్రం విడుదలను వాయిదా వేశాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ"న్నారు. ఇక దర్శకుడు వైవియస్ చౌదరి మాట్లాడుతూ "భారీ వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పిస్తుంది. కథ, కథనాలపరంగాను, సాంకేతికంగానూ ఉన్నత విలువలతో తెరకెక్కింది" అన్నారు. సందీప్‌ చౌతా సంగీతాన్ని సమకూర్చారు.ఇక రాష్ట్రంలో ఉన్న రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇక ఈ చిత్రం కోసం విష్ణు సన్నగా మారి,హెయిల్ స్టైయిల్ మార్చారు. ఇలియానా..వైవియస్ చౌదరి పరిచయం చేసిన హీరోయిన్ కావటంతో మరింత ఉత్సాహంగా అందాల ఆరబోత కార్యక్రమం చేసిందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని మోహన్ బాబు, బిగ్ పిక్చర్స్ వారితో కలిసి తమ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే ఆయన ఈ చిత్రంలో లోకల్ డాన్ గా మరో ముఖ్యమైన పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు సలీం అనే పాత్రను చేస్తుంటే, ఇలియానా సత్య అనే అల్లరి అమ్మాయిగా, కావేరి ఝా చిట్టి అనే మరో ముఖ్యమైన పాత్రను చేస్తోంది. ఇక వైవియస్ చౌదరి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఒక్క మగాడు చిత్రం కూడా సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X