బాలీవుడ్ డైరక్టర్ తో మంచు విష్ణు వర్ధన్ నెక్ట్స్
'సలీం' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచు మనోజ్ కు ఆ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని ఇవ్వటంతో ఇక నుంచి ఆచితూచి సినిమాలు సెలెక్టు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ కోవలోనే తాజాగా హేమంత్ మధుకర్ అనే ఓ బాలీవుడ్ డైరక్టర్ చెప్పిన కథ విని డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రం ఓ ధ్రిల్లర్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇక హేమంత్ మధుకర్ గతంలో 'ఫ్లాట్' అనే థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే హేమంత్ తెలుగువాడే కావటం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హేమంత్ హిందీలో తొలి చిత్రాన్ని చేసారు. అయితే తెలుగులో దర్శకుడుగా సెటిల్ అవ్వాలనే ఆలోచనతో ఇక్కడ హీరోలను ఎప్రోచ్ అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని విష్ణు తమ సొంత బ్యానర్ పైనే చేద్దామని కథా చర్ఛలు జరుపుతున్నారు. ఈ చిత్రమైనా విష్ణుకి మళ్ళీ ఢీ చిత్రం లాంటి హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











