టీనేజీ అమ్మాయితో విశాల్ ఎఫైర్, గోడ దూకేవాడని ప్రచారం... మహిళ అరెస్ట్

Recommended Video

Woman Spreading Vishal-teenage Girl Affair Rumours Arrested || Filmibeat Telugu

తమిళ హీరో విశాల్‌కు, ఓ టీనేజీ అమ్మాకి ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఓ మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై ప్రొటెక్షన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎగైనిస్ట్ సెక్సువల్ అఫెన్స్(POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

తన కూతురు మీద సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు బహిర్గతం అయ్యాయి. విశ్వదర్శిని అనే మహిళ ఈ తప్పుడు ప్రచారం చేసినట్లు తేల్చారు.

అర్దరాత్రి విశాల్ గోడలు దూకేవాడు

అర్దరాత్రి విశాల్ గోడలు దూకేవాడు

విశ్వదర్శిని అనే మహిళ... విశాల్ పేరు ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టింది. తన ఇంటి సమీపంలో నివాసం ఉండే టీనేజీ అమ్మాయితో అతడికి ఎఫైర్ ఉందని, ఆమెను కలిసేందుకు అర్దరాత్రి విశాల్ గోడదూకి వచ్చేవాడని ఆరోపణలు చేసింది. ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ తప్పుడు ప్రచారం మొదలు పెట్టడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా చేసింది

ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా చేసింది

ఈ కేసులో పోలీసులు విచారణ జరుపగా... తమ పొరుగువారితో విశ్వదర్శిని చాలా కాలంగా గొడవ పడుతోందని, ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ ఆరోపణలు చేసినట్లు తేలింది. అయితే కొన్ని నెలలుగా ఆమె కనిపించకుండా పోవడంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఆమె తిరుచెంకోడె ప్రాంతంలో దాక్కుందని తెలియడంతో అరెస్ట్ చేసి POCSO కింద కేసు నమోదు చేశారు.

తమిళనాడులో హాట్ టాపిక్

తమిళనాడులో హాట్ టాపిక్

ఒక సినీ నటుడి పేరు వాడి తన పొరుగున ఉండే వారిపై క్షక్ష తీర్చుకునేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన మహిళ సంఘటన తమిళనాడులో చర్చనీయాంశం అయింది. ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు మంచి పని చేశారని, ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నపుడే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విశాల్

విశాల్

విశాల్ త్వరలో అనీషా రెడ్డి అనే తెలుగు అమ్మాయిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వారికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అక్బోబర్లో మ్యారేజ్ ప్లాన్ చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే... విశాల్ నటించిన ‘అయోగ్య' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం సుందరి సి దర్శకత్వంలో తన 27వ చిత్రం చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X