బూతులు తిట్టా... కానీ విజయ్ దేవరకొండ, అతడి ఫ్యాన్స్‌ను కాదంటున్న విశ్వక్ సేన్!
'ఫలక్‌నుమా దాస్' చిత్రం వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. ఈ చిత్రంలో బూతు డైలాగులు ఉండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ బూతులు తిడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టడంతో వివాదం మరింత రాజుకుంది. ఈ ఇష్యూ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
సినిమా బాగోలేదని కామెంట్స్ చేసిన వారిని ఉద్దేశించి, మీడియా రివ్యూలను ఉద్దేశించే విశ్వక్ సేన్ బూతులు తిడుతూ రెచ్చిపోయినట్లు అంతా చర్చించుకుంటున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు తన మూవీపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారనే కోపంతో విశ్వక్ సేన్ ఇలా రెచ్చిపోయినట్లు చర్చ జరుగుతోంది.
ఈ ప్రచారంపై విశ్వక్ సేన్ సోమవారం స్పందించారు. ఇదంతా మీడియా వారి సృష్టి మాత్రమే అని, తాను ఎప్పుడూ విజయ్ దేవరకొండ పేరు కానీ, అతడి ఫ్యాన్స్ ప్రస్తావన కానీ తేలేదని తెలిపారు. దీన్ని ఓ వివాదంగా క్రియేట్ చేసి మీడియా వారే హాట్ టాపిక్ క్రియేట్ చేశారని విశ్వక్ సేన్ అభిప్రాయపడ్డారు.

విజయ్ దేవరకొండ హానెస్ట్ యాక్టర్, అలాంటి యాక్టర్లు రావాలి, వస్తేనే ఇండస్ట్రీ కొత్తరకం సినిమాలు చూస్తుంది. అతడిపై నాకు ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్ లేదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో బూతులు తిడుతూ మాట్లాడింది నా సినిమా పోస్టర్లు చించిన వారిని, పైరసీ లింగులు పోస్ట్ చేసిన వారిని ఉద్దేశించి మాత్రమే అని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు.
సినిమా బాగోలేదు అన్నవారిని నేను తిట్టే రకం కాదు. ఆడియన్సును అనే అవసరం నాకు అస్సలు లేదు. ఎందుకంటే నా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. రివ్యూ రైటర్లను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు మరోసారి విశ్వక్ సేన్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











