సిర్ఫ్ పంద్రా మినట్స్‌లో జెట్ స్పీడ్‌లో వచ్చా.. కార్తీకేయ పిలువగానే అంటూ విశ్వక్ సేన్ లవ్లీ స్పీచ్
కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. నవంబర్ 12వ తేదీన సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయగా అనుహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సుధీర్ బాబు, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ...

రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని కొత్త పెళ్లి కొడుకు కార్తీకేయ గుమ్మకొండ ఆహ్వానించాడు. షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ.. 7.30 గంటలకు ప్యాకప్ చెప్పి సిర్ఫ్ పంద్రా మినట్స్‌లో జెట్ స్పీడ్‌తో వచ్చాను. సుధీర్ బాబు చెప్పినట్టు అందరు కలిసి మెలిసి ఉంటారనేది నిజం. అందరు హీరోలు కలిసి మంచిగా మాట్లాడుతారంటే అది కేవలం కార్తీకేయ గురించే. అందుకోసమే కార్తీకేయ అడగ్గానే నేను నో చెప్పలేకుండా వచ్చాను. అందరు హీరోలకు పెళ్లికి ముందు బ్లాక్ బస్టర్ ఉంది. పెళ్లి చేసుకోబోతున్న కార్తీకేయకు కూడా రాజా విక్రమార్క బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకొంటున్నాను అని విశ్వక్ సేన్ అన్నారు.
కార్తీకేయ కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ సినిమాలో నటిస్తున్నాడు. అజిత్‌తో కలిసి వాలిమై సినిమాలో నటించడం తెలిసిందే. వచ్చే సంవత్సరం నుంచి మనకు పాత రోజులు వచ్చాయి. రాజా విక్రమార్క చిత్రం మంచి విజయం సాధిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ నా మొదటి సినిమాకు సంగీతం ఇచ్చారు. మళ్లీ ఆయనతో పనిచేయాలనిఅనుకొంటున్నాను అని విశ్వక్ సేన్ తెలిపారు.
విశ్వక్ సేన్ తన స్పీచ్ ముగిస్తుండగా.. తొందరగా వెళ్లండి అసలే ఈ రోజు శనివారం అంటూ సుమ పంచ్ విసిరింది. దాంతో అవును షాపులు తొందరగా మూసేస్తారు అని విశ్వక్ సేన్ రివర్స్ కౌంటర్ వేశారు.


Click it and Unblock the Notifications











