Ori Devuda Twitter Review: విశ్వక్ మూవీకి అలాంటి టాక్.. వెంకటేష్ రోల్ ఇలా.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎంతో మంది యంగ్ హీరోలు పరిచయమయ్యారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ హవా చూపిస్తున్నారు. అలాంటి వారిలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న విశ్వక్ సేన్ ఒకడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను చేస్తున్న ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రమే 'ఓరి దేవుడా'. విక్టరీ వెంకటేష్ కూడా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ మీకోసం!

ఓరి దేవుడా అంటోన్న విశ్వక్

ఓరి దేవుడా అంటోన్న విశ్వక్

మాస్ హీరోగా పేరొందిన విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'ఓరి దేవుడా'. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. వెంకటేష్ సర్‌ప్రైజింగ్ రోల్‌ను చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆశా భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు.

అలాంటి స్టోరీ.. లవ్ ఎమోషన్

అలాంటి స్టోరీ.. లవ్ ఎమోషన్

తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఓ మై కాదవులే' చిత్రానికి 'ఓరి దేవుడా' రీమేక్‌గా వచ్చింది. హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే అపార్థాలతో వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. అలాంటి సమయంలో వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? వీరిద్దరి సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? అనే అంశాలతో ఫన్ అండ్ ఎమోషనల్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

ట్విట్టర్‌లో అలాంటి టాక్‌తో

విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. 'ఓరి దేవుడా' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా డీసెంట్‌గా ఉందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. దీంతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని

విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీని చూసిన ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌లో 'ఓరి దేవుడా మూవీ ఫస్టాఫ్ మొత్తం డీసెంట్‌గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో సినిమా బాగుంది. అలాగే, విశ్వక్ సేన్ నటన కూడా అదిరిపోయింది. కానీ, సినిమా మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు.

సెకెండాఫ్ అలా.. ఓవరాల్‌

విశ్వక్ సేన్ - మిథిలా పాల్కర్ జంటగా నటించిన 'ఓరి దేవుడా' మూవీని చూసిన నెటిజన్ 'ఓరి దేవుడా ఓవరాల్‌గా మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ చాలా బాగుంది. మొదటి భాగం మొత్తం కామెడీగా సాగిపోగా.. రెండో భాగంలో అసలైన కథను చూపించారు. దీనికి మంచి సంగీతం కూడా యాడ్ అయింది. కాబట్టి దీన్ని చూడొచ్చు' అని రాసుకొచ్చాడు.

సినిమాకు హీరో అతడేనని

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీని చూసిన మరో నెటిజన్ 'ఓరి దేవుడా మూవీని ఇప్పుడే చూశాను. ఇది మొత్తం మీద డీసెంట్‌గా ఉంది. ఇందులో విశ్వక్ సేన్ నటన అద్భుతంగా ఉంది. కానీ, ఈ చిత్రానికి లియాన్ జేమ్స్ తన సంగీతంతో సినిమాకు హీరోగా మారాడు. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు ఆకట్టుకున్నారు' అంటూ ట్వీట్ చేశాడు.

వెంకటేష్ యాక్టింగ్ ఇలా

వెంకటేష్ యాక్టింగ్ ఇలా

'ఓరి దేవుడా' మూవీని చూసిన ఓ నెటిజన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అందులో 'ఓరి దేవుడా సినిమాల విశ్వక్ సేన్ తనదైన నటనతో కుమ్మేశాడు. ఊహించదగిన క్లైమాక్స్ తప్ప సినిమా మొత్తం సూపర్‌గా ఉంది. విక్టరీ వెంకటేష్ సాధారణమైన స్టైలిష్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా ఎప్పటిలాగే ఆకట్టుకుంది' అంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X