Vishwak Sen: అలా చేయడంతో తప్పుకున్నా.. అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ రియాక్షన్

హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవలే ఓరి దేవుడా చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యాక్టర్ అండ్ డైరెక్టర్ అర్జున్ సర్జా, విశ్వక్ సేన్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ సేన్ ప్రవర్తనా తీరు అస్సలు బాగోలేదని, అతనికి గౌరవం లేదని, పనిపట్ల డెడికేషన్ లేదని, అతనికి జరిగినట్లు మరొక నిర్మాతకు జరగకూడదనే ఉద్దేశంతో విశ్వక్ సేన్ పై ఫిల్మ ఛాంబర్ కు ఫిర్యాదు ఇవ్వనున్నట్లు తెలిపాడు అర్జున్ సర్జా. ఆయన వ్యాఖ్యలపై తాజాగా విశ్వక్ సేన్ టీమ్ స్పందించాడు.

డైరెక్టర్ గా 17వ సినిమా..

డైరెక్టర్ గా 17వ సినిమా..

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అర్జున్ సర్జా-విశ్వక్ సేన్ వివాదం కొనసాగుతోంది. ఈ కాంట్రవర్సీ హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందన్నప్పటి నుంచి ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకులు యాక్షన్ కింగ్ అని ముద్దుగా పిలుచుకునే అర్జున్ సర్జా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయన డైరెక్టర్ గా 17వ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాతో తెలుగు తెరకు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అలాగే హీరోగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ను అనుకున్నారు. ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేత ముహుర్తపు క్లాప్ కొట్టించి ప్రారంభించారు.

కొన్నింటికి సూచనలు..

కొన్నింటికి సూచనలు..

ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరుకావడంతో ఈ సినిమా అందరి దృష్టిలో పడి హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల అనేక వార్తలు వినిపిస్తున్నాయి. రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేసినప్పటికీ చిత్రీకరణ్ సాగట్లేదని టాక్ వచ్చింది. ఇక ఇవాళ విశ్వక్ సేన్ బిహేవియర్ సరిగ్గా లేదని అర్జున్ సర్దా ఆయనపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వక్ సేన్ టీమ్ స్పందించింది. సంభాషణలు, పాటలు, మ్యూజిక్ ఇలా పలు విషయాల్లో విశ్వక్ సేన్ అభ్యంతరం చెప్పిన విషయం నిజమేనన్నారు. అందులో కొన్నింటికి సూచనలు ఇచ్చారట. అయితే ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ అస్సలు అంగీకరించడం లేదని, ఆయన చెప్పినట్లే నడుచుకోవాలని అంటున్నారని వారు తెలిపారు.

విశ్వక్ మాటకు విలువ లేదు..

విశ్వక్ మాటకు విలువ లేదు..

విశ్వక్ చెప్పిన మాటలకు విలువ లేదని, ఆయన మాటకు అస్సలు గౌరవం ఉండదని తెలిపారు. అందుకే విశ్వక్ సేన్ తన మనసుకి నచ్చని పని చేయలేక సినిమా నుంచి బయటకు వచ్చినట్లు ఆయన టీమ్ చెప్పింది. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్, అగ్రమెంట్ డాక్యుమెంట్స్ ను విశ్వక్ సేన్ నిర్మాతల మండలికి పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అతని సోషల్ మీడియా అకౌంట్స్ లలో కూడా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఇలా వివాదం అవుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ తన అభిప్రాయాలను మీడియా ముందుకు వచ్చి చెబుతారా.. లేదా వేరేలా చెబుతారు.. లేకుంటే స్పందించకుండా ఉంటారా అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X