For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ashoka Vanamlo Arjuna Kalyanam ట్విట్టర్ రివ్యూ: రిలీజ్‌కు ముందే షాక్.. విశ్వక్ మూవీ టాక్ ఏంటంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో తమదైన మార్కును చూపిస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ పోరడు విశ్వక్ సేన్ ఒకడు. 'వెల్లిపోమాకే' అనే సినిమాతో హీరోగా పరిచయమైన అతడు.. 'ఫలక్‌నామాదాస్' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే 'హిట్'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ మధ్య 'పాగల్'తో వచ్చిన విశ్వక్.. ఇప్పుడు 'అశోక వనములో అర్జున కళ్యాణం' అనే సినిమాను చేశాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  ‘అశోక వనములో అర్జున కళ్యాణం’

  ‘అశోక వనములో అర్జున కళ్యాణం’

  క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'అశోక వనములో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ చింతా తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. జై క్రిష్ దీనికి సంగీతం సమకూర్చారు. ఈ మూవీని ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. ఇందులో రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలను చేశారు.

  Bhala Thandhanana ట్విట్టర్ రివ్యూ: శ్రీ విష్ణు మూవీకి అలాంటి టాక్.. రాజమౌళి చెప్పిందే జరుగుతుందా!

  వివాదంతో మరింత జనాల్లోకెళ్లింది

  వివాదంతో మరింత జనాల్లోకెళ్లింది

  ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లే ఇటీవలే హీరో విశ్వక్ సేన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఇది సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకు వెళ్లింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే, టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి.

  బిజినెస్ భారీగానే.. గ్రాండ్‌గా రిలీజ్

  బిజినెస్ భారీగానే.. గ్రాండ్‌గా రిలీజ్

  విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ జరిగింది. దీనికి అనుగుణంగానే ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు చాలా సినిమాలు ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో దీనికే ఎక్కువ థియేటర్లు లభించాయి.

  మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!

  విశ్వక్ సేన్ మూవీకి అలాంటి టాక్

  విశ్వక్ సేన్ మూవీకి అలాంటి టాక్

  విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీన్ని చూసిన వాళ్లంతా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బాగుందనే చెప్తున్నారు. రిలీజ్‌కు ముందే వివాదం రూపంలో పెద్ద షాక్ తగిలినా.. టాక్ పరంగా మాత్రం సంతృప్తినే ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

  ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ ఇంకోలా

  ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ ఇంకోలా


  'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, కథను చెప్పడం, కొన్ని కామెడీ సన్నివేశాలతో హాయిగా సాగిపోతోందట. అయితే, సెకెండాఫ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని అంటున్నారు. మధ్యలో కొన్ని అనవసర సన్నివేశాలు జొప్పించడం వల్ల కొంత ఫీల్ మిస్సయ్యేలా అనిపించినా క్లైమాక్స్‌ చక్కగా ఉందట.

  ఒకే బెడ్‌పై ప్రియుడితో నయనతార: ఒకరి మీద ఒకరు క్లోజ్‌గా.. ఫొటో బయటకు రావడంతో!

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌లు ఇవే

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌లు ఇవే

  విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీని చూసిన వాళ్లంతా చెబుతోన్న అంశాల ప్రకారం.. ఇందులో హీరో నటన, డైలాగ్స్, మేనరిజం, ఎమోషన్స్‌ అద్భుతంగా ఉన్నాయట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎమోషన్స్, కథ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. కానీ, స్క్రీన్‌ప్లేలో వేగం లేకపోవడం, కొన్ని చోట్ల ఎమోషన్ మిస్ అవడం మైనస్ అని చెబుతున్నారు.

  మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది?

  మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది?


  ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు చెబుతోన్న సమాచారం ప్రకారం.. విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లే వాళ్లకు ఇది నచ్చుతుందట. మరీ ముఖ్యంగా మాస్ హీరోనే అయినా క్లాస్ పాత్రలో విశ్వక్ సేన్ విశ్వరూపం చూపించాడని సినిమాను చూసిన వాళ్లు అంటున్నారు.

  English summary
  Vishwak Sen Did Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Under Viday Sagar Chinta Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X