For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Paagal Movie Twitter Review: పాగల్‌కు ఊహించని టాక్.. ప్లస్‌లు మైనస్‌లు ఇవే.. మొత్తంగా ఎలా ఉందంటే!

  |

  కరోనా ప్రభావంతో ఈ ఏడాది కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భారీ నష్టాలు తప్పలేదు. షూటింగ్‌లు ఆగిపోవడం.. థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలు వాయిదా పడిపోయాయి. దీంతో ఎంతో మంది చిన్న, పెద్ద నిర్మాతలకు అపారమైన నష్టం వాటిల్లింది. అలాగే, సినిమా హాళ్లు కూడా శాశ్వతంగా మూతపడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 30 నుంచి సినిమా సందడి మొదలైంది. ఆరోజు రెండు సినిమాలు.. తర్వాతి వారం ఏకంగా ఆరు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో చాలా మూవీలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మిగిలిన వాళ్లంతా ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన చిత్రం 'పాగల్'. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంది? నెటిజన్లు దీనిపై ఏమంటున్నారు?

  ‘హిట్’ కొట్టి ‘పాగల్’గా వస్తున్న విశ్వక్ సేన్

  ‘హిట్’ కొట్టి ‘పాగల్’గా వస్తున్న విశ్వక్ సేన్


  'వెల్లిపోమాకే' అనే సినిమాతో హీరోగా పరిచయమై 'ఫలక్‌నామాదాస్' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలోనే 'హిట్'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. దీని తర్వాత ఈ యంగ్ హీరో నటిస్తోన్న చిత్రమే 'పాగల్'. ప్రేమకథా నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాను నరేష్ కుప్పిలి తెరకెక్కించాడు. ఇందులో నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘలేఖ హీరోయిన్లుగా నటించారు. రాధాన్ సంగీతం అందించగా.. లియోన్ జేమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ ఈ సినిమాను నిర్మించారు.

  ట్రాన్స్‌పరెంట్ బ్రాతో కంగనా రనౌత్ ఘాటు ఫోజులు: అరాచకమైన ఫొటోలతో రచ్చ చేసిన బ్యూటీ

  పాగల్ మూవీపై భారీగా ఏర్పడ్డ అంచనాలు

  పాగల్ మూవీపై భారీగా ఏర్పడ్డ అంచనాలు

  హీరోగా చేసిన చిత్రాలు చాలా తక్కువే అయినా విశ్వక్ సేన్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా యూత్‌లో అతడికి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అందుకే 'పాగల్' మూవీకి ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు వాటిని మరింతగా పెంచేశాయి. దీంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో దిల్ రాజు భాగం అవడంతో దీని రేంజ్ భారీగా పెరిగిపోయింది. అదే సమయంలో ఇండస్ట్రీలోనూ దీనిపై భారీ బజ్ ఏర్పడిపోయింది.

  ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా.. థియేటర్ల కూడా

  ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా.. థియేటర్ల కూడా

  విశ్వన్ సేన్‌కు ఉన్న ఫాలోయింగ్, మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్లకు ప్రేక్షకులు అందించిన రెస్పాన్స్, సినిమా కోసం దిల్ రాజు ముందుకు వచ్చి ఇందులో భాగం అవ్వడం వంటి కారణాలతో 'పాగల్' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. దీనికి సంబంధించిన హక్కులు మొత్తాన్ని దాదాపు రూ. 8 కోట్లకు పైగానే అమ్మినట్లు తెలుస్తోంది. అయితే, కోవిడ్ ప్రభావంతో ఆ మొత్తాన్ని కొంత తగ్గించారన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 700లకు పైగా థియేటర్లలో విడుదల అవుతోంది. లాక్‌డౌన్ తర్వాత ఇదే గ్రాండ్ రిలీజ్ అని చెప్పుకోవచ్చు.

  Bigg Boss Telugu 5లోకి ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా: మతి పోగొట్టే ఫోజులతో ఘాటు ఫొటోలు

  అక్కడ మొదలైన షోలు.. గ్రాండ్ ఓపెనింగ్స్

  అక్కడ మొదలైన షోలు.. గ్రాండ్ ఓపెనింగ్స్

  'పాగల్' మూవీ యూఎస్‌లో దాదాపు వందకు పైగా లొకేషన్లలో విడుదల అయింది. ఇప్పటికే అక్కడ ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే, తెలంగాణలో కూడా ఈ సినిమా విడుదలకు ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కేలా కనిపిస్తోంది. అదే జరిగితే మొదటి రోజు దాదాపు కోటి రూపాయలకు పైగానే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఏపీలోనూ ఈ చిత్రం ఎక్కువ థియేటర్లలోనే విడుదల కాబోతుంది.

  ‘పాగల్’ మూవీకి అలా టాక్.. ట్విట్టర్ రివ్యూ

  ‘పాగల్’ మూవీకి అలా టాక్.. ట్విట్టర్ రివ్యూ

  ఎప్పటికే యూఎస్‌లోని అన్ని లొకేషన్లలో 'పాగల్' మూవీ విడులైంది. అంతేకాదు, అక్కడ షోలు కూడా పూర్తయ్యాయి. దీంతో సినిమాను చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను పరిశీలిస్తే.. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చిత్రాన్ని వీక్షించిన వాళ్లలో కొంత మంది ఇది బాగుందని.. మరికొంత మంది మాత్రం నిరుత్సాహ పరిచిందని కామెంట్లు చేస్తున్నారు. అక్కడ అలాంటి స్పందనను అందుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి.

  పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

  ‘పాగల్’.. ఫస్టాఫ్ ఇలా.. సెకాండాఫ్ మరోలా

  ‘పాగల్’.. ఫస్టాఫ్ ఇలా.. సెకాండాఫ్ మరోలా


  ఇప్పటి వరకూ 'పాగల్' మూవీని చూసిన ప్రేక్షకులు చెబుతున్న వివరాలు ప్రకారం.. విశ్వక్ సేన్ నటించిన ఈ చిత్రం ఫస్టాఫ్ అదిరిపోయేలా ఉందట. మరీ ముఖ్యంగా ఇది చాలా కొత్తగా ఉందని, మలుపులతో కూడిన ఇంటర్వెల్ సినిమాపై అంచనాలు పెంచేస్తుందని చెబుతున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం ఏమంత ఆకట్టుకునే విధంగా లేదన్న కామెంట్లు చేస్తున్నారు. ద్వితియార్థంపై ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు.. అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యాడని అంటున్నారు. దీంతో ఫస్టాఫ్ బాగున్నా.. సెకెండాఫ్ మాత్రం అంత గొప్పగా లేదని అభిప్రాయ పడుతున్నారు.

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌లను చూడండి

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌లను చూడండి

  'పాగల్' సినిమాపై మామూలుగానే అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ వాటిని రెట్టింపు చేసేలా మాట్లాడాడు. అయితే, ఇప్పుడు సినిమాకు మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ ఉన్నాయని వీక్షకులు చెబుతున్నారు. ఇక, ఇందులో విశ్వక్ సేన్ నటన, మ్యూజిక్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఫస్టాఫ్, కామెడీ హైలైట్‌గా ఉన్నాయట. అలాగే, సెకెండాఫ్, ఎడిటింగ్, డైరెక్షన్, ఎమోషనల్ సీన్స్, బోరింగ్ సీన్స్ మైనస్‌గా మారాయని సినిమా చూసిన వాళ్లు వెల్లడిస్తున్నారు.

  మెగా ఫ్యామిలీలోకి ఆరియానా గ్లోరీ: అతడితో కలిసి సెల్ఫీ వీడియో.. సీక్రెట్ లీక్ చేసిన బ్యూటీ

  Recommended Video

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  ‘పాగల్’ మూవీ.. మొత్తంగా ఎలా ఉందంటే!

  ‘పాగల్’ మూవీ.. మొత్తంగా ఎలా ఉందంటే!

  'పాగల్' సినిమా ట్విట్టర్ ద్వారా వీక్షకులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా చాలా కొత్త కాన్సెప్టుతో తెరకెక్కించారట. అయితే, సెకెండాఫ్‌లో బోరింగ్ సీన్స్ కారణంగా ఇది తీవ్రంగా నిరాశ పరుస్తుందని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు. విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షోతో సినిమాను లాక్కొచ్చే ప్రయత్నం చేసినా.. ఇందులోని మైనస్‌లు దాన్ని డామినేట్ చేశాయని అంటున్నారు. అయితే, ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ కంటే యూత్‌కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉండడం 'పాగల్'కు బాగా కలిసొచ్చే అంశమని చెప్పాలి.

  English summary
  Young Hero Vishwak Sen Now Did a Film Paagal Movie Under Naresh Kuppili Direction. This Movie Released Today. Twitter Review on this occasion is for you.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X