twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు ధమ్కీ ఇచ్చా.. ఇక షాకిస్తా.. విశ్వక్‌సేన్ మరో సంచలనం

    |

    ఈ మధ్యకాలంలో సినిమా విడుదల కావడం.. ఆ వెంటనే కాంట్రవర్సీలు చుట్టుముడుతుండటం కామన్ అయిపోయింది. ఈ కోవలోనే ఇటీవలే 'ఫ‌ల‌క్‌నుమాదాస్‌ ' సినిమాకు సంబంధించి పెద్ద రచ్చే జరిగింది. తన సినిమాను కొందరు టార్గెట్ చేశారని ఫ‌ల‌క్‌నుమాదాస్‌ హీరో విశ్వక్‌సేన్ రెచ్చిపోయి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో ఆ తర్వాత తప్పు తెలుసుకొని విశ్వక్‌సేన్ వివరణ ఇవ్వడం, ఆ ఇష్యు క్లోజ్ అవ్వడం చక చకా జరిగిపోయాయి. కాగా తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో విశ్వక్‌సేన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం తిరిగి సినీ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

    హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా తానే చేపట్టి ఫ‌ల‌క్‌నుమాదాస్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు విశ్వక్‌సేన్. గతంలో ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈ కుర్రాడు ఫ‌ల‌క్‌నుమాదాస్‌ ద్వారా కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకు సీక్వల్ కూడా ఉంటుందని, అది ఫస్ట్ పార్ట్‌ను మించి ఉంటుందని అంటున్నాడు విశ్వక్‌సేన్.

    Vishwak Sens sensetional comments on Falaknuma Das again

    తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన విశ్వక్‌సేన్.. ఫలక్‌నుమాదాస్తో ధమ్కీ ఇచ్చా.. నా నెక్స్ట్ సినిమాతో షాక్ ఇస్తా.. అని అనడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సందర్బంగా చిత్ర నిర్మాత క‌రాటే రాజు మాట్లాడుతూ.. మే 31 వ తేదీన విడుదలైన మా ఫ‌ల‌క్‌నుమాదాస్‌ సినిమా 7 రోజుల్లో 7 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌సూలు చేసింద‌ని తెలిపాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఫ‌ల‌క్‌నుమాదాస్ 2ను భారీ క్యాస్టింగ్‌తో తెర‌కెక్కిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయన అన్నాడు. ఈ సినిమా కంటే సినిమా థియేట‌ర్స్ సంఖ్య కూడా పెరుగుతుంద‌ని, మ‌ల‌యాళంలో అంగ‌మాలై సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని విశ్వ‌క్‌సేన్ సినిమాను తెర‌కెక్కించాడ‌ని ఆయన చెప్పాడు.

    English summary
    Vishwak Sen who played a lead role in Falaknuma Das, has responded on trolling by fans of Vijay Devarakonda on social media. Now again Vishwak Sen reacted to announce Falaknuma Das 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X