Vishwak Sen: ఇండస్ట్రీలో కాంపౌండ్స్ వేయకండి.. విశ్వక్‌ సేన్‌ కామెంట్స్ వైరల్

Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలక్ నామా దాస్ లాంటి మాస్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మాస్ హిట్ కొట్టి అందుకున్నారు. యూత్ ను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. తనదైన స్టైల్ లో అందర్ని అలరించే ప్రయత్నం చేస్తాడు విశ్వక్ సేన్. అలాగే.. తన మూవీ హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఒకే రకమైన ఆటిట్యూడ్ మైంటైన్ చేస్తాడు. అలాగే.. ఏ విషయాన్ని అయినా స్ట్రైయిట్ గా చెప్పేస్తారు. తాజాగా మా మధ్య కంపౌండ్స్ వేయొద్దంటూ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారింది. ఇంతకీ ఏమైందంటే..?

మస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ యాక్షన్ అండ్ కామెడీ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్లల్లో బిజీగా మారారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టీజర్స్ పై ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.

Vishwak Sen shocking Comments about Mega Compound in Laila Movie Trailer Event

'లైలా' సినిమా కోసం విశ్వక్ సేన్ సాహసమే చేశారని చెప్పాలి.ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ సినిమాలో విశ్వక్‌ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా నటించారు.లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోన్ (విశ్వక్ సేన్) అనుకోకుండా ఓ ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కుంటాడు. దీంతో సోన్ ను చంపడానికి ఎమ్మెల్యే మనుషులు ప్రయత్నిస్తుంటారు. మరో వైపు పోలీసులు కూడా గాలిస్తుంటారు. ఈ క్రమంలో సోన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి, విశ్వక్ లైలా అనే లేడీ గెటప్‌ వేసుకుంటాడు. లేడీ గెటప్‌లోకి మారిన విశ్వక్‌కు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు ఏమిటి? ఎమ్మెల్యే హత్య కేసు నుంచి ఎలా బయటపడుతాడు అనేది తెలుసుకోవాలంటే లైలా చూడాల్సిందే. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

లైలా సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు. 'మీ సినిమా ఈవెంట్‌లకు నందమూరి హీరోలను తెస్తారు. సడెన్‌గా బాస్‌ను తీసుకొచ్చారేంటీ? ఆ కంపౌడ్ నుంచి ఈ కంపౌడ్ కు వచ్చారా' అని రిపోర్ట్ ప్రశ్నించగా.. హీరో విశ్వక్‌ షాకింగ్ రిప్లై ఇచ్చారు. 'కాంపౌండ్‌లు మీరు వేసుకుంటారు. మాకున్నది ఒకటే కాంపౌండ్‌. అది మా ఇంటిది. ఇక్కడ కాంపౌండ్స్ ఏమి లేవు. ఇండస్ట్రీ అంతా ఒకటే. బాస్‌ ఈజ్‌ బాస్‌. మమ్మల్ని అభిమానించే వాళ్లు ఎలా ఉంటారో.. మేము అభిమానించే వాళ్లూ ఉంటారు. కానీ, ప్రతిసారి వాళ్లను పిలిచి ఇబ్బంది పెట్టలేం కదా. ఒక హీరోను ఈవెంట్‌కు పిలవడానికి వంద కారణాలుంటాయి. నిర్మాతతో అనుబంధం, హీరోతో స్నేహం ఇలా చాలా ఉంటాయి' అన్నారు.

Vishwak Sen shocking Comments about Mega Compound in Laila Movie Trailer Event

అంతటితో ఆగకుండా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'మా నాన్నకు, చిరంజీవిగారికీ రాజకీయాల నుంచి పరిచయం ఉంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి మలక్ పేట్ ఎమ్మెల్యే పోటీ చేశారు.చిరంజీవి మాకు శ్రేయోలాభిలాషి. మా మధ్య రిలేషన్ కు 1000 కారణాలుంటాయి. కానీ, దయచేసి మీరు కాంపౌండ్స్ వేయకుర్రి. ఇప్పటికే లేని వాటి గురించి అనవసరం. ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకోవడం, ఒకరినొకరూ తిట్టుకోవడం చేస్తున్నాం. అలాంటివి సమసిపోయేలా చూడాలి. కానీ, ఇండస్ట్రీలో లేని పోని కాంపౌండ్‌లు కట్టకండి. ఇండస్ట్రీ అనేది చాలా క్లీన్ ప్లేస్. మేము మంచి ఉద్దేశంతో సినిమాను ప్రమోట్‌ చేసుకుంటున్నాం. సాఫీగా కొనసాగుతున్న రిలేషన్స్ ల్లో మీరొచ్చి ఏమీ వేయకండి'అని రిక్వెస్ట్ చేశారు.

More from Filmibeat

Read more about: vishwak sen tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X