Das Ka Dhamki Twitter Review: విశ్వక్ మూవీకి అలాంటి టాక్.. అదే తేడా కొట్టిందా? ఇంతకీ ధమ్కీ హిట్టేనా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు అందరిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. వరుస చిత్రాలతో దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ గాయ్ విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభంలోనే తనదైన చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన అతడు.. కొన్ని హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' అనే మాస్ యాక్షన్ మూవీతో వచ్చాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి మరి!

దాస్ కా దమ్కీ అంటోన్న విశ్వక్

దాస్ కా దమ్కీ అంటోన్న విశ్వక్

యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మాస్ మూవీనే 'దాస్ కా ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'దాస్ కా ధమ్కీ'. ఓ పేద కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో కార్పోరేట్ కంపెనీకి సీఈవోగా వెళ్లడం.. అక్కడ అతడికి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురు కావడం వంటి కథాంశాలతో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ధమ్కీకి ట్విట్టర్‌లో టాక్ ఏంటి?

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీ ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్లా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ట్విట్టర్‌లో కొందరేమే ఇది బాగుందని.. మరికొందరేమో ఏవరేజ్‌గా ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉందంటూ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అతడు చేసిన ట్వీట్‌లో 'దాస్ కా ధమ్కీ మూవీ ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. కొత్తదనం ఏమీ అనిపించలేదు. సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు. ఇంటర్వెల్ మాత్రం డీసెంట్‌గా ఉంది' అని అభిప్రాయపడ్డాడు.

సెకెండాఫ్‌లో ట్విస్టులు పెట్టి

'దాస్ కా ధమ్కీ' మూవీని వీక్షించిన మరో నెటిజన్ 'సెకెండాఫ్‌లో విశ్వక్ సేన్ తనలోని నటుడిని మరింతగా బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే, ఎన్నో ట్విస్టులను ఇందులో నింపాడు. అయితే, ఇవన్నీ గతంలో చూసినట్లే అనిపిస్తాయి. ఫలక్‌నామా దాస్ దర్శకుడి నుంచి మరింతగా ఆశించాను. మొత్తం మీద బిలో ఏవరేజ్ సినిమా' అని ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు.

అన్ని విభాగాలకూ రేటింగ్స్

విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమాను వీక్షించిన ఇంకో నెటిజన్ రేటింగులు ఇచ్చాడు. 'నటుడిగా విశ్వక్‌కు ఐదుకు నాలుగు రేటింగ్, రైటర్‌గా 3.5, డైరెక్టర్‌గా 3. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌లో స్టోరీ లేదు. సెకెండాఫ్‌లోనే మొత్తం ఉంది. ట్విస్టులన్నీ ఊహించనదగినవే. కానీ ఈ సినిమాను చూడొచ్చు. మొత్తంగా నా రేటింగ్ 3.25/5' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

తెలుగు సినిమాకు సంపద

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీని చూసిన మరో నెటిజన్ 'దాస్ కా ధమ్కీ తెలుగు సినిమాకు ఒక సంపద లాంటిది. విశ్వక్ సేన్ అన్న డైరెక్షన్ బాగుంది. అతడి యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అతడి స్క్రీన్ ప్రజెన్స్ కూడా సూపర్ ఉంది. పిచ్చెక్కించేశావు కదన్నా. సందేహమే లేదు ఉగాది బ్లాక్ బస్టర్ మూవీ' అంటూ వెల్లడించాడు.

సినిమా రేంజ్ పడిపోయింది

సినిమా రేంజ్ పడిపోయింది


విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో 'దాస్ కా ధమ్కీ ఓవరాల్‌గా ఏవరేజ్ మూవీ. ఫస్టాఫ్‌లో కొన్ని సరదా సన్నివేశాలు ఉన్నాయి. దీని తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ పూర్తిగా పక్కదారి పట్టింది. ఓవర్ టాప్ సీన్స్, తరచూ వచ్చే ట్విస్టులు, నాసిరకమైన స్క్రీన్‌ప్లే వల్ల సినిమా రేంజ్ పడిపోయింది' అని తెలిపాడు.

ట్విస్టులే తేడా కొట్టాయి అంటూ

ట్విస్టులే తేడా కొట్టాయి అంటూ

విశ్వక్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లను బట్టి ఇది ఏవరేజ్ మూవీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సెకెండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఎక్కువయ్యాయని, అవే ఒకరకంగా మైనస్‌గా మారాయని అంటున్నారు. అయితే, టాక్ ఇలా ఉన్నా కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X