కరోనా కలకలం.. టాలీవుడ్ లో మరో యంగ్ హీరోకు.. వ్యాక్సిన్ వేయించుకున్నా వదల్లేదు.. జాగ్రత్త అంటూ!

తగ్గిపోయింది అనుకున్న కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మహారాష్ట్ర లాంటి చోట్ల మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు ఉండగా బాలీవుడ్ నుంచి చాలా మంది నటీ నటులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే...

లక్షల మంది కరోనా బారిన

లక్షల మంది కరోనా బారిన

కరోనా 2019 వ సంవత్సరం లో భారత దేశంలో ఎంట్రీ ఇచ్చి విధ్వంసం సృష్టించింది. కొన్ని లక్షల మంది కరోనా బారిన పడగా, వేల సంఖ్యలో కరోనా బారిన పడి మరణించిన పరిస్థితులు కూడా చూశాం. తగ్గిపోతుంది అని భావించగా రెండో దశ కూడా వచ్చి అనేక మందిని పొట్టన పెట్టుకుంది. అయితే కరోనాను తగ్గించడానికి వ్యాక్సిన్ కనుగొనడంతో ఇక ఇబ్బంది ఉండదు అని అందరూ భావిస్తూ వచ్చారు.

భారతదేశంలో కో కొల్లలుగా

భారతదేశంలో కో కొల్లలుగా

కానీ రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇప్పుడు కరోనా సోకుతుంది. కొత్తగా ఓమైక్రాన్ అనే ఒక కొత్త వేరియంట్ కరోనా విషయంలో బయటపడడంతో అది అందరినీ మరింత భయపెడుతోంది. ఎవరు ఊహించని విధంగా ఓమైక్రాన్ కేసులు భారతదేశంలో కో కొల్లలుగా బయట పడుతున్నాయి.

ఓమైక్రాన్ తొలి మరణం

ఓమైక్రాన్ తొలి మరణం

తాజాగా ఓమైక్రాన్ తొలి మరణం కూడా భారత దేశంలో నమోదయింది. అయితే అనుకోని పరిస్థితుల్లో అనేక మంది బాలీవుడ్ నటీనటులు ఈ కరోనా బారిన పడుతున్నారు. ముందుగా కరీనా కపూర్ ఒక పార్టీలో పాల్గొనగా ఆమె ద్వారా అనేక మందికి కరోనా సోకింది. తాజాగా దుబాయ్ లో నివాసముంటున్న మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ కు కూడా కరోనా సోకింది.

 అర్జున్ కపూర్ కి సైతం కరోనా

అర్జున్ కపూర్ కి సైతం కరోనా


అలాగే ముంబైలో ఉన్న బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కి ఆయన సోదరి అన్షులా కపూర్ కు సైతం కరోనా సోకింది. అయితే ఈ కరోనా కేవలం బాలీవుడ్కు మాత్రమే పరిమితం అవుతుంది అనుకుంటే టాలీవుడ్ కు కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. ముందుగా యువ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. దీంతో గత వారం రోజులుగా తనను కలిసిన వారు అందరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలి అని ఆయన కోరారు. ఇప్ప్పుడు మరో హీరో కూడా కరోనా బారిన పడ్డారు.

Recommended Video

Raja Vikramarka Pre Release Event సినిమాకి పాత రోజులు వచ్చాయి Vishwak Sen
 విశ్వక్సేన్ కరోనా బారిన

విశ్వక్సేన్ కరోనా బారిన

అయితే ఇప్పుడు తాజాగా యువ హీరో విశ్వక్సేన్ కూడా కరోనా బారిన పడ్డారు ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అందరికీ హాయ్ నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో నన్ను నేను ఐసోలేషన్ లో ఉంచుకుని అన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ డాక్టర్ సలహా మేరకు పాటిస్తున్నాను. వాక్సినేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఇలా కరోనా సోకడం దురదృష్టకరం, ఈ కొత్త స్ట్రైన్ ఒక కార్చిచ్చు లాగా విరుచుకుపడుతోంది. మీ అందరూ విధిగా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి, మీ సపోర్ట్ కి ప్రేమకు ధన్యవాదాలు అంటూ విశ్వక్సేన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X